Paisa Double: పెట్టుబడిని రెండింతలు చేయటం అనేది ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చాలా కష్టమని మనందరికీ తెలిసిందే. కానీ ఇవేవి పట్టనట్లుగా కొన్ని షేర్లు మాత్రం తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను, బోనస్ షేర్లను అందిస్తూ రత్నాల్లాగా మెరిసిపోతున్నాయి.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆగ్రోకెమికల్ రంగంలోని సిక్కో ఇండస్ట్రీస్ కంపెనీ గురించే. ఇన్వెస్టర్ల సంపదను స్వల్ప కాలంలోనే ఈ స్టాక్ డబుల్ చేసేసింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ప్రస్తుతం పెట్టుబడిదారులకు 1:2 రేషియోలో బోనస్ షేర్లను అందిస్తోంది. అంటే ప్రతి రెండు షేర్లు కలిగి ఉన్న వారికి ఒక షేర్ ఉచితంగా లభించనుంది. కంపెనీ బోనస్ షేర్లు అందించటానికి అక్టోబర్ 28ని రికార్డు తేదీగా నిర్ణయించింది.

కేవలం రెండు నెలల్లో..
ఆగ్రోకెమికల్ కంపెనీ షేర్లు 18 ఆగస్టు 2022న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో రూ.38.83 స్థాయిలో ఉన్నాయి. కానీ ఈ రోజు స్టాక్ 5 శాతం పెరిగి రూ.100.40 వద్ద అప్పర్ సర్కూట్ లో లాక్ అయ్యాయి. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని కంపెనీ దాదాపు రెండింతలు చేసింది. అలాగే మూడేళ్ల కాలంలో షేర్ ఏకంగా 1000 శాతం రాబడిని అందించింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.172.95 వద్ద ఉండగా, కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర రూ.42.20గా ఉంది.

ఏడాది కాలంలో..
గత ఏడాదిలో పెట్టుబడిదారులకు 270% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 22, 2021న NSEలో కంపెనీ షేర్లు రూ.38.60 స్థాయిలో ఉన్నాయి. అక్టోబర్ 28, 2022 NSEలో కంపెనీ షేర్లు రూ.100.40 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.168.68 కోట్లుగా ఉంది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి రెండు సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి.

కంపెనీ వ్యాపారం..
సికో ఇండస్ట్రీస్ లిమిటెడ్ మట్టి కండీషనర్లు, సేంద్రీయ పురుగుమందులు, వ్యవసాయ ఫంగిసైడ్స్ వంటి అధిక నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. కంపెనీకి రోజుకు 50000 లీటర్లకు పైగా అగ్రికెమికల్స్, 240MT ఎరువులు, 28000 HDPE సీసాలు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సెప్టెంబర్ 2022 త్రైమాసిక షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం కంపెనీలో ప్రమోటర్లకు 71.43 శాతం వాటా ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications