IPO News: నేడే ప్రారంభమైన ఐపీవో.. గ్రేమార్కెట్ నుంచి శుభవార్త.. పందెం వేస్తున్నారా..??

IPO News: ఈరోజు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మెుత్తం రెండు ఐపీవోలు ప్రారంభం అవుతున్నాయి. ఒకటి కళామందిర్ కాగా మరొకటి సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా కంపెనీ ఐపీవో. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీవోల కోసం తహతహలాడుతున్న ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మార్కెట్లో పండుగ రోజులు కొనసాగుతున్నాయి. కొత్త కంపెనీల రాకతో కోలాహలానికి అడ్డు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నేడు సిగ్నేజర్ గ్లోబల్ ఇండియా ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. సెప్టెంబర్ 22న ముగుస్తున్న ఐపీవో స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.366-385గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.730 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Signature Global IPO opening today for subscription, Know details

సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా IPO లాట్ పరిమాణం 38 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం రూ.14,630 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఐపీవో ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.319.50 కోట్లను సమీకరించింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్లకు లాక్ ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 7, 2024గా ఉంది.

ఇదే క్రమంలో గ్రేమార్కెట్లో సిగ్నేచర్ గ్లోబల్ మంచి పనితీరును కనబరుస్తున్నట్లు శుభవార్త ఇన్వెస్టర్లను ఆనందానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఒక్కో షేరుపై రూ.40 ప్రీమియం అందుబాటులో ఉంది. దీని ప్రకారం కంపెనీ స్టాక్ లిస్టింగ్ రోజున రూ.425 ఉండొచ్చు. ఐపీవోలో పార్టిసిపేట్ చేసే ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 27న షేర్లను తమ డీమ్యాట్ ఖాతాల్లో పొందుతారని వెల్లడైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+