తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీగాచి కెమికల్స్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత, కంపెనీ షేర్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 14 శాతం వరకు కుప్పకూలాయి.
ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో Sigachi Industries షేరు ధర రూ. 47.64కి ట్రేడ్ అవుతోంది. నిన్న ఈ కంపెనీ షేరు రూ. 55.12 వద్ద ట్రేడ్ అయింది. అయితే ప్రమాద వార్త తెలిసిన తర్వాత షేర్లు కుప్పకూలాయి. ఏకంగా 13.57 శాతం తగ్గుదల నమోదైంది. కాగా Nifty 50 సూచిక కేవలం 0.62 శాతం మాత్రమే పడిపోయింది.. కానీ Sigachi షేరు మాత్రం నోటీసబుల్‌గా పతనమైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా రూ. 1,820 కోట్ల వరకు తగ్గిపోయింది.

ఈ షేర్ పతనానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఆ కంపెనీకి చెందిన పాశమైలారం యూనిట్‌లో ఒక రియాక్టర్ పేలుడు వల్ల జరిగిన భారీ అగ్నిప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో పదిమంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. రియాక్టర్ పేలుడు సమయంలో పరిశ్రమలో కొన్ని వందల మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకున్నారు. అక్కడ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం పటాన్ చెరు పోలీసులకు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి ఉదయం 9:37 గంటల సమయంలో అందింది. వెంటనే పటాన్‌చేరు, సంగారెడ్డి, కూకట్‌పల్లి, మాధాపూర్, జీడిమెట్ల, రాజేంద్రనగర్ వంటి వివిధ స్టేషన్ల నుండి దాదాపు 11 ఫైర్ టెండర్లు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకురావడానికి, కార్మికుల్ని రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అధికారులు తక్షణమే రంగంలోకి దిగి మంటల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఔషధ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ (MCCP) తయారు చేసే సిగాచీ ఇండస్ట్రీస్ ను 1989లో స్థాపించారు. హైదరాబాద్, గుజరాత్‌లో ఉన్న రెండు ప్లాంట్లలో మొత్తం 11,880 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కంపెనీ ఫార్మా ఎక్సిపియంట్స్, న్యూట్రాస్యూటికల్స్, ఫుడ్ ఇన్గ్రీడియంట్స్ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. ఈ పేలుడు ప్రమాదం కంపెనీ ప్రతిష్ఠపైనే కాకుడా పెట్టుబడిదారుల నమ్మకంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు కంపెనీ తదుపరి నిర్ణయాలు, ప్రభుత్వ విచారణలపై పెట్టుబడిదారులతో పాటు పరిశ్రమవర్గాలు వాచ్ చేస్తున్నాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications