Siddhartha Saxena: రోజుకు రూ.76 కోట్లు సంపాదిస్తున్న వ్యాపారవేత్త.. ఎవరీ సిద్ధార్థ్ సక్సేనా..!

ఏ పని అయినా అంకిత భావంతో పని చేస్తూ.. ఓపికగా ముందుకు వెళ్తారో వారు విజయం సాధిస్తారు. డబ్బు ఉన్నా లేకపోయిన పట్టుదలతో ముందుకెళ్తే విజయం దాసోహం అవుతుంది. ఇలానే భారతదేశంలోని చిన్న పట్టణం నుంచి అమెరికాలో కోట్లాది డాలర్ల విలువైన కంపెనీలు స్థాపించే స్థాయికి ఎదిగారు సిద్ధార్థ్ సక్సేనా. అమెరికాలో అయనే టెక్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఐఐటీ కాన్పూర్ లో చేదుకున్న ఆయన రోజుకు 8 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.76.99 కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఈ విజయం ఒక్క రోజులో రాలేదని ఆయన చెబుతున్నారు. కంటెంట్ క్రియేటర్ విరాజ్ అలా సిద్ధార్థ్ సక్సేనాను ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ తన జీవిత ప్రయాణ విషయాలను పంచుకున్నారు. తను ఐఐటీ కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో బిటెక్ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. అప్పట్లో హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే.. ఐఐటీ కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో సీటు సాధించడం చాలా కష్టమని అన్నారు. అలాగే మీ సంవత్సరం సంపాదన ఎంతని విరాజ్ అడిగినప్పుడు.. సిద్ధార్థ్ ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. తను ఒక్క రోజులోనే 8 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదంతా కేవలం రాత్రికి రాత్రి జరిగిందని కాదని స్పష్టం చేశారు. తను 26 ఏళ్ల వయసులో మిలియనీర్ అయినట్లు గుర్తు చేశారు.

siddarth Saxena

2019లో తన బిటెక్ పూర్తయిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్వెస్టనెట్, యోడ్లీ, వాద్వాని ఏఐ, ఫిన్లాండ్ లోని ఆల్టూ యూనివర్సిటీ, కెనడాలోని జూమియో కార్పొరేషన్ వంటి సంస్థలలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పని చేసినట్లు తెలిపారు. తను 2022లో తన కాన్పూర్ ఐఐటీ బ్యాచ్ మెట్స్ ప్రత్యూష్ రాయ్, సిర్సెందు సర్కార్ లతో కలిసి ఏఐ ఆధారిత క్రోమ్ ఎక్సె టెన్షన్ అయిన మెర్లిన్ ను స్థాపించినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ విలువ దాదాపు 50 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియాలో పరిమిత వనరుల కారణంగా.. చాలా మంది భయంతో ఉంటారని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రుల కలను రుద్దకూడదని అన్నారు.

అదే అమెరికాలో ప్రజలు అయితే తమకు నచ్చిన పనిని ఎంచుకుంటారని వివరించారు. కానీ భారతదేశంలో చాలా మంది అవసరం కొద్దీ పని చేస్తారని సిద్ధార్థ్ సక్సేనా పేర్కొన్నారు. తన సొంత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చిన్న వయసులోనే ఇంతటి విజయాన్ని సాధిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని సక్సేనా చెప్పారు. చక్కని ప్రణాళికతో పాటు కష్టపడే తత్వం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపారు. అయితే ఈ విజయం ఒక్కోసారి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని.. అందుకే పట్టుదల అనుకున్నది చేయాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+