Viral News: డబ్బులుంటే ఇండియా వదిలేయండి.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్..
Investor Immigration: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏమూలన ఏ దేశంలో ఉన్న వారైనా మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా తాము ఉంటున్న దేశంపై కొంత విముఖతను కలిగి ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు తాము నివసిస్తున్న దేశాన్ని విడిచి మరో దేశానికి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అయితే ఈ కోవకు చెందిన ఒక పెట్టుబడిదారుడు తాను ఇండియాలో గమనించిన సమస్యల గురించి అభిప్రాయాలను వ్యక్తపరచటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు అతని అభిప్రాయాన్ని కరెక్ట్ అంటుంటే మరికొందరు తప్పుపడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గోవాకు చెందిన ఇన్వెస్టర్ సిద్దార్థ్ సింగ్ గౌతమ్ గురించే. భారతీయ పౌరుడైన సిద్దార్థ్ గోవా నుంచి సింగపూర్ కి 2025లో మకాం మార్చాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. పైగా ఆయన లేవతెచ్చిన అంశాలపై భారీగా చర్చ కొనసాగుతోంది. తాను ప్రస్తుతం భారతదేశంలోని రాజకీయనాయకుల వల్ల దేశం వదిలి వెళ్లిపోవటానికి అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసేపనిలో ఉన్నట్లు పేర్కొన్నాడు. సంపాదిస్తున్నదానిలో దాదాపు 40 శాతం పన్నులుగా చెల్లిస్తూ, కాలుష్యపూరితమైన గాలిని పీల్చాల్సిన దుస్థితిపై రాజకీయనాయకులను దుయ్యబట్టారు. దీనిపై నాయకులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం లేదన్నాడు.

అలాగే మంచి డబ్బు ఉన్న వ్యక్తులకు ఇండియా విడిచి తమకు అనుకూలమైన వేరే దేశంలో స్థిరపడాలని ట్విట్టర్ ఖాతాలో సూచించాడు. ఈ క్రమంలో తనకు దుబాయ్, యూరప్, బాలీ, సింగపూర్ లలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావటం లేదని తనకు దీనిపై సలహాలు ఇవ్వాలని నెటిజన్లను అతడు కోరాడు. ఇదే క్రమంలో సిద్దార్థ్ మరో సంచలన విషయాన్ని పేర్కొన్నాడు. ఇండియాలో నెలకు రూ. లక్ష సంపాదించే వ్యక్తి రాజకీయనాయకుడికి సేవకుడిగా బతకాల్సి ఉంటుందని, అదే థాయ్ లాండ్ లో రూ.లక్ష సంపాదించే వ్యక్తి రాజకీయనాయకుడిలా బతుకుతాడని అన్నాడు. అందువల్ల వీలైనంత తొందరగా ప్రజలు భారతదేశాన్ని వీడాలని సూచించాడు. ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ రేటును భారీగా 35 శాతం వరకు పెంచాలని చూస్తున్నట్లు వచ్చిన వార్తను షేర్ చూస్తూ ఇలాంటి వాటివల్లే తాను ఇండియా విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు బయటపెట్టినట్లు ఇన్వెస్టర్ పేర్కొన్నాడు.
అయితే ఇన్వెస్టర్ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించటం ప్రారంభించారు. స్వచ్ఛమైన గాలి కోసం ఐస్‌లాండ్ లేదా ఏదైనా భారతీయ పర్వతాల్లోకి వెళ్లాలని ఒక నెటిజన్ సూచించాడు. శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నందున పనికి ఎలాంటి ఇబ్బంది ఉండని అన్నాడు. ఇదే క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు తాము కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉన్నట్లు స్పందించారు. మరొక యూజర్ తాను మాతృభూమిని విడిచిపెట్టబోనని, అందమైన దేశాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లనని అన్నాడు. సిద్దార్థ్ వ్యాఖ్యలపై మరో వ్యక్తి కామెంట్ చేస్తూ ఈ వ్యక్తి ఇండియా విడిటి ఎక్కడికీ వెళ్లడని ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications