IPO News: అడుగుపెట్టగానే పైసా డబుల్.. తొలిరోజే ఐపీవో సంచలన లాభాలు.. కొన్నారా..??
Shri Balaji IPO: కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత నేడు మెుదటి ఐపీవో మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీలో ఐపీవోపై పందెం వేయగా షేర్లు అలాట్ అయిన వారు ప్రస్తుతం సంతోషంలో మునిగి తేలుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీ బాలాజీ వాల్వ్ కాంపోనెంట్స్ కంపెనీ షేర్ల గురించే. కొత్త సంవత్సరంలో వచ్చిన ఎస్ఎమ్ఈ ఐపీవో బలమైన లిస్టింగ్ నమోదు చేసింది. దీంతో ఇన్వెస్టర్లకు విపరీతమైన రాబడులను అందించింది. షేర్లు బీఎస్ఈలో 90 శాతం ప్రీమియం ధరతో రూ.190 వద్ద జాబితా అయ్యింది. అయితే లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్ ధర రూ.199.50కి చేరుకుంది. దీంతో పెట్టుబడిదారులు డబ్బు కొన్ని క్షణాల్లోనే 100 శాతం లాభాన్ని అందించింది.

బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవోను కంపెనీ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధర రూ.100 వద్ద అలాట్ చేసింది. వాస్తవానికి ఐపీవో ఇష్యూ డిసెంబర్ 27న తెరవబడి డిసెంబర్ 29న ముగిసింది. ఈ క్రమంలో నేడు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో షేర్లు జాబితా అయ్యాయి. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ పరిశీలిస్తే.. రిటైల్ కేటగిరీలో 169.95 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల(QIB) విభాగంలో 70.04 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII) విభాగంలో 799.70 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.
తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ.21.60 కోట్లను సమీకరించింది. ఉందుకోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేసింది. ఐపీవో నుంచి సేకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, అదనపు ప్లాంట్ యంత్రాల ఏర్పాటు కోసం ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications