IPO News: లిస్టింగ్ బాంబు పేల్చిన ఐపీవో.. ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్స్, ఎవ్వరూ అమ్మట్లేదుగా..
Shree Tirupati Balajee IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు బుల్ జోరుతో ఒకపక్క కొనసాగుతుండగా, మరో పక్క ఐపీవోలు క్రేజీ ఎంట్రీతో దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఊహించని లాభాలను అందుకున్నారు. పైగా లిస్టింగ్ తర్వాత ఐపీవో అప్పర్ సర్క్యూట్ తాకింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో కంపెనీ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు బీఎస్ఈలో 12 శాతం ప్రీమియం ధర రూ.92.90 వద్ద లిస్టింగ్ చేయబడింది. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 8.4 శాతం ప్రీమియంతో రూ.90 వద్ద ఉడుగుపెట్టింది. అయితే లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లలో కొనుగోళ్ల కోలాహలం కొనసాగటంతో ఐపీవో షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో ఒక్క ఇన్వెస్టర్ కూడా కంపెనీ షేర్లను విక్రయించటానికి సిద్ధంగా లేరు. దీంతో షేర్ ధర ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.94.50కి చేరుకుంది.

ఇష్యూ ప్రారంభం నుంచి కంపెనీ షేర్లు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందనను పొందాయి. ఈ క్రమంలో గ్రేమార్కెట్లో ఒక్కో షేరుపై ఏకంగా 70 శాతం ప్రీమియం ధర పలికింది. కానీ చివరికి లిస్టింగ్ సమయంలో కేవలం 12 శాతం ప్రీమియం ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.78-83గా నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ 1.47 కోట్ల తాజా ఈక్విటీ షేర్లతో పాటు ప్రమోటర్లకు చెందిన 56.90 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించింది. ఐపీవో ద్వారా రైజ్ చేసిన మెుత్తాన్ని కంపెనీ రుణ చెల్లింపులతో పాటు అనుబంధ సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి, మూలధన అవసరాలకు మద్దతు ఇవ్వడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనుంది.
సోమవారం బిడ్డింగ్ చివరి రోజున IPO 124.74 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 210.12 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ భాగం 150.87 రెట్లు, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 73.22 రెట్లు బిడ్లను అందుకుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.169.65 కోట్లను విజయవంతంగా సమీకరించింది. 2001లో స్థాపించబడిన కంపెనీ రసాయనాలు, వ్యవసాయ రసాయనాలు, ఆహారం, మైనింగ్, వ్యర్థాల తొలగింపు, వ్యవసాయం, కందెనలు, ఎడిబుల్ ఆయిల్‌తో సహా వివిధ పరిశ్రమల ప్యాకేజింగ్ అవసరాలను తీర్చేందుకు ఫ్లెక్సిబుల్ ఇంటర్మీడియట్ బల్క్ కంటైనర్‌లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications