IPO News: అరె భల్లేభల్లే.. ఒక్క నిమిషంలో 50 శాతం లాభం.. తొలిరోజే దంచికొట్టిన ఐపీవో..
Shree Marutinandan IPO: అదృష్టం ఉండాలే గానీ ఐపీవోల్లో డబ్బులు సంపాదించటం క్షణాల్లో పనని మరోసారి రుజువైంది. అవును ఈరోజు మార్కెట్లో జాబితా అయిన ఒక కంపెనీ రెప్పపాటు కాలంలోనే భారీ లాభాలను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీ మారుతీనందన్ ట్యూబ్స్ కంపెనీ ఐపీవో గురించే. తొలిరోజే అత్భుతం చేసిన ఈ ఐపీవో షేర్లు ఒక్కొక్కటి రూ.200 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు ఒక షేరుపై లిస్టింగ్ సమయంలో 39 శాతం లాభాన్ని పొందారు. కంపెనీ ఐపీవో గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.143గా ఉంది.

స్టాక్ మార్కెట్లోకి లిస్టయిన నిమిషంలోపే కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో షేర్ ధర రూ.210 స్థాయికి చేరుకుంది. దీంతో బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో తన ఇన్వెస్టర్లకు తొలిరోజు మెుత్తంగా 46 శాతం రాబడిని అందించింది. ఈ ఐపీవోపై చాలా మంది పెట్టుబడిదారులు బెట్టింగ్ వేశారు.
శ్రీ మారుతీనందార్ ట్యూబ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఐపీవో చివరి రోజున 47.16 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఇది రిటైల్ కేటగిరీలో 59.71 రెట్లు, ఇతర కేటగిరీల్లో సభ్యత్వం 32.67 రెట్లుగా నమోదైంది. వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా మెుత్తంగా రూ.14.20 కోట్లను సమీకరించింది.
ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో జనవరి 12 నుంచి 16 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో ఐపీవో ఇష్యూ కోసం గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.143గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల లాట్ పరిమాణం 1000 షేర్లుగా ఉంది. అంటే ఎవరైనా పెట్టుబడిదారులు దరఖాస్తు చేయాలంటే కనీసం రూ.1,43,000 వెచ్చించాల్సి ఉంది. తాజా ఐపీవోతో కంపెనీలో ప్రమోటర్ల వాటా గతంలో ఉన్న 82 శాతం నుంచి 58.30 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications