Upcoming IPO: దేశంలో ప్రస్తుతం ఐపీవో హవా మామూలుగా లేదు. ఈక్విటీ పెట్టుబడుల కంటే తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ అందించటంతో అనేక మంది వీటి వెంట పడుతున్నారు.ఈ క్రమంలో గ్రేమార్కెట్లోనే ఐపీవోల రికార్డుల మోత మోగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెక్స్‌టైల్ పరిశ్రమకు సంబంధించిన శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. కంపెనీ ఐపీవో ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లో 51 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. మార్చి 11 వరకు రిటైల్ ఇన్వెస్టర్లు ఈ కంపెనీ ఐపీవోపై బెట్టింగ్ వేసేందుకు ఇంకా అవకాశం మిగిలే ఉండటం శుభవార్తనే చెప్పుకోవాలి. వాస్తవానికి కర్ణి ఫ్యాబ్‌కామ్ ఐపీవో మార్చి 6న బిడ్డింగ్ కోసం తెరవబడింది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లిస్టింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ షేర్లు గ్రే మార్కెట్‌లో 110 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్ ఐపీవో ధర రూ.220 నుంచి రూ.227. గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ.250 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఈ లెక్కన ఐపీవో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర ప్రీమింతో కలిపి లిస్టింగ్ సమయంలో రూ.477 స్థాయి వద్ద ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. లిస్టింగ్ రోజున పెట్టుబడిదారులు దాదాపు 110 శాతం కంటే ఎక్కువ లాభాలను ఆశించవచ్చు. అలాగే కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లలో మార్చి 14న జాబితా అవనున్నాయి. దీంతో పెట్టుబడిదారుల నుంచి ఐపీవోకి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది.
శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్ ఐపీవో మొదటి 2 రోజుల్లో 51.45 సార్లు సభ్యత్వం పొందింది. ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 86.24 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా(NII) 37.93 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 0.71 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్ కంపెనీ మార్చి 2018లో ప్రారంభించబడింది. కంపెనీ మెడికల్ ఆర్చ్ సపోర్ట్, కుర్చీలు, షూ, దుస్తులు పరిశ్రమల కోసం అవసరమైన, నేసిన బట్టలను ఉత్పత్తి చేస్తుంది. ఐపీవో కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications