Shree Karni Fabcom IPO: మార్కెట్లు నేడు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోల లిస్టింగ్ కోలాహం నేడు యథాతథంగా కొనసాగుతోంది. నిన్న మార్కెట్లోకి వచ్చిన రెండు ఐపీవోలు నిరాశకు గురిచేసినప్పటికీ నేడు బంపర్ లిస్టింగ్ జోష్ తిరిగి నింపింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్ ఐపీవో గురించే. శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్ ఐపీవో స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన లిస్టింగ్‌ను నమోదు చేసింది. కంపెనీ 14.53 శాతం ప్రీమియం రేటుకు జాబితా చేయబడి ఇన్వెస్టర్లను సంతోషంలోకి నెట్టేసింది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఒక్కో షేరు ధర రూ.260 వద్ద జాబితా చేయబడింది. అద్భుతమైన పేలుడు లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో షేరు ధర ఏకంగా రూ.273 స్థాయిని అధిగమించింది.

మెుత్తానికి కంపెనీ ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు తొలిరోజు 20 శాతానికి పైగా లాభాన్ని అందుకున్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో మార్చి 6 నుంచి మార్చి 13 వరకు తెరిచి ఉంది. వాస్తవానికి కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.220-రూ.227గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ కనీసం పెట్టబడిగా రూ.1,36,200 ఇన్వెస్ట్ చేశారు. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.42.49 కోట్లను సమీకరించింది. ఇందుకోసం 18.72 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన మూడవ రోజున అంటే మార్చి 11, 2024న కంపెనీ 296.43 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ని పొందింది. IPO రిటైల్ కేటగిరీలో 330.45 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. 3 రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో ఐపీవో మొత్తం 350 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.


Click it and Unblock the Notifications