Mutual Funds: పెట్టుబడి పెట్టిన ఫండ్ పనితీరు సరిగా లేకుంటే డబ్బులు వెనక్కు తీసుకోవాలా..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన వారు వారి రాబడి చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే వారు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ సరిగా రాబడి ఇవ్వకపోతే పెట్టుబడిదారుడు ఆందోళన చెందుతారు. ఫండ్ నుంచి డబ్బు తీసి మరో ఫండ్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తారు. పెట్టుబడిదారులు ఈ తక్కువ పనితీరు తాత్కాలికమా లేక శాశ్వతమా ఫండ్‌లో ఏదైనా మార్పు జరిగిందా, దాని స్థానంలో వచ్చే కొత్త ఫండ్ నిజంగా పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుందా అనే విషయాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తు్ననారు. ఒకవేళ ఫండ్ మారాలని నిర్ణయించుకుంటే, అదే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC)తో కొనసాగాలా లేక వేరే చోట చూడాలా? అనే సందేహాలు వస్తాయి.
ఒక సంవత్సరం రాబడుల పట్టికలో ఒక ఫండ్ అట్టడుగున ఉండటం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ ఒక ఈక్విటీ ఫండ్‌ను అంచనా వేయడానికి ఒక సంవత్సరం చాలా తక్కువ సమయం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు తరచుగా కేటాయింపు నిర్ణయాలు తీసుకోవడానికి ఇటీవలి పనితీరును చూడటం ద్వారా 'రీసెన్సీ బయాస్'అనే ప్రభావానికి లోనవుతుంటారని ఆనంద్ రాఠీ వెల్త్ డైరెక్టర్ చిరాగ్ ముని అంటున్నారు. ఎప్పుడైనా మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు పనితీరును అంచనా వేయాలని, ఫండ్‌ను దాని బెంచ్‌మార్క్, కేటగిరీ సగటుతో పోల్చాలని సూచిస్తున్నారు.

ర్యాంకింగ్‌లు త్వరగా మారవచ్చని పేర్కొన్నారు. క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్ 2023, 2024లో మెరుగైన పనితీరు కనబరిచిన వాటిలో ఒకటిగా నిలిచిందని అన్నారు. కానీ 2025లో 3 శాతం కంటే తక్కువ రాబడితో 35 స్కీమ్‌లలో 35వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 2026 తిరిగి రెండవ స్థానానికి చేరుకుందని గుర్తు చేశారు. అందుకు ఒకటి, రెండు సంవత్సరాలతో ఫండ్ ను అంచనా వేయలేమని వివరించారు.
ప్రతికూల రాబడి వచ్చినంత మాత్రాన ఫండ్ విఫలమైందని అర్థం కాదని వెల్తీ.ఇన్ సహ-వ్యవస్థాపకుడు ఆదిత్య అగర్వాల్ అన్నారు. వివిధ మార్కెట్ పరిస్థితులలో దాని బెంచ్‌మార్క్, సంబంధిత తోటి ఫండ్‌లతో పోల్చుకోవాలని సూచించారు.
ప్రస్తుత రాబడుల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నదాన్ని ఎంచుకోవడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ ఈ రోజు టాప్ ర్యాంకులో ఉంది రేపు పడిపొవచ్చు. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ 2024లో 57 శాతానికి పైగా రాబడులతో అగ్రస్థానంలో ఉన్న మిడ్-క్యాప్ ఫండ్‌గా నిలిచింది. కానీ 2025లో 12 శాతానికి పైగా ప్రతికూల రాబడితో ఆ విభాగంలో అట్టడుగుకు చేరింది. అందుకే ఫండ్ పర్ఫామెన్స్ బాగా లేకుంటే వెంటనే ఫండ్ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
