ATM News: ఏటీఎం యూజర్లకు మెగా షాక్ సిద్ధం.. ఆర్‌బీఐ సన్నాహాలు, పూర్తి వివరాలు..

ATM Cash Withdrawal: ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త గవర్నర్ ఎంట్రీ తర్వాత వస్తున్న మెుదటి సమావేశం కావటంతో ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ ప్రజలు ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపుల దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికీ డెబిట్ కార్డుల వినియోగం కొనసాగుతూనే ఉంది. అయితే గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవటాన్ని ఖరీదైనదిగా మార్చవచ్చని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏటీఎంల నుంచి డబ్బు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ మార్చబోతోందని వెల్లడైంది.

shocking withdrawing money from ATMs to become more expensive as RBI prepares to increase fees

ప్రస్తుతం అమలులో ఉన్న రూల్స్ పరిశీలిస్తే.. ప్రతి నెల బ్యాంక్ వినియోగదారులు 5 సార్లు ఉచితంగా అందిస్తోంది. ఈ లిమిట్స్ దాటిన తర్వాత చేసే ట్రాన్సాక్షన్లపై రుసుమును బ్యాంకులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. మారనున్న రూల్స్ ప్రకారం ఈ ఉపసంహరణ రుసుములను ఉచిత లిమిట్ తర్వాత 5 రెట్లు పెంచే యోచనలో రిజర్వు బ్యాంక్ ఉన్నట్లు బిజినెస్ లైన్ నివేదించింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డెబిట్ కార్డులను డబ్బు ఉపసంహరణ కోసం వినియోగించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NPCI క్యాష్ విత్‌డ్రా రుసుమును ప్రస్తుత రూ.21 నుండి రూ.22కి పెంచాలని సిఫార్సు చేసినట్లు నివేదించబడింది. అలాగే డెబిట్ కార్డు వినియోగదారులు ఇతర బ్యాంకుల ఏటీఎం నుండి పరిమితి కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ద్వారా విత్‌డ్రా చేస్తే ఇంటర్‌చేంజ్ రుసుము వసూలు చేయబడుతుందని వెల్లడైంది. ఈ ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచే విషయాన్ని కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తోందని వెల్లడైంది. దీనికింద మెట్రో నగరాలతో పాటు నాన్-మెట్రో నగరాల్లో కూడా ఛార్జీల మోత ఉండనుందని తేలింది.

ఎన్పీసీఐ సిఫార్సులను వైట్ లేబుల్ ఏటీఎంలతో పాటు బ్యాంకులు కూడా అంగీకరించినట్లు విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా వెల్లడైంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల మెట్రోయేతర నగరాల్లో ఏటీఎంల నిర్వహణ ఖర్చు వేగంగా పెరుగుతోందని సదరు సంస్థలు వెల్లడించాయి. దీనికి అనుగుణంగానే ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకింగ్ సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు వీలుగా చర్యలకు రిజర్వు బ్యాంక్ సిద్ధమౌతోందని సమాచారం. అయితే ఎంపీసీ సమావేశం చివరి రోజున గవర్నర్ దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+