ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పెస్ ఎక్స్ అండ్ టెస్లా అధినేత ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ టీంలో భాగమైనప్పటి నుండి అతని పై విద్వేషం పెరుగుతోంది. దీనికి కారణం ఆయన చేసే ప్రకటనలు. ఎందుకంటే ఇప్పుడు అతను రాజకీయ నాయకుడిల ప్రకటనలు చేస్తున్నారు, దింతో ప్రజలు అతనికి వ్యతిరేకంగా వ్యహరిస్తు టెస్లాపై కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. టెస్లా అమ్మకాలు తగ్గడానికి కారణం ఎలోన్ మస్క్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న కోపం.

ఆన్‌లైన్ సర్వే: ఎలోన్ మస్క్ స్వదేశమైన అమెరికా, యూరప్‌లో కూడా టెస్లాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. టెస్లా గురించి ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు జర్మన్ పబ్లికేషన్ T-ఆన్‌లైన్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జర్మనీలోని ప్రజలు టెస్లా కార్లు కొంటారా అని అడిగారు. మార్చి 11న విడుదలైన సర్వే ఫలితాల ప్రకారం లక్ష మంది స్పందించిన వారిలో దాదాపు 94% మంది టెస్లాను కొనడానికి అనుకూలంగా లేరని తేలింది. టెస్లా కారు కొనడంలో తమకు ఎటువంటి సమస్య ఉండదని తెలిపిన వారిలో కేవలం 3% మంది మాత్రమే ఉన్నారు. ఈ సర్వే ఫలితాలు అస్సలు ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే టెస్లాకు వ్యతిరేకంగా ఇప్పటికే ర్యాలీలు కూడా జరిగాయి, ముఖ్యంగా యూరప్‌లో.
కానీ ఒక వారం తర్వాత ఆన్‌లైన్ సర్వే ఫలితాలు పూర్తిగా మారడంతో ఈ విషయంలో ట్విస్ట్ వచ్చింది. ఈ సర్వేలో పాల్గొనేవారి సంఖ్య అకస్మాత్తుగా లక్ష నుండి 4.67 లక్షలకు పైగా పెరిగింది. 70.1% మంది టెస్లా కార్లు కొనేందుకు పరిశీలిస్తామని చెప్పాగా, టెస్లాను కొనేందుకు నిరాకరించిన వారి రేషియో 29.2%కి పడిపోయింది. ఈ మార్పు ఏదో అనుమానాస్పదంగా ఉందని, T-ఆన్‌లైన్ దర్యాప్తు చేస్తే మొత్తం విషయం స్పష్టమైంది.
ఎలోన్ మస్క్ సర్వే ఫలితాలను మార్చాడా: సర్వేలో పోలైన మొత్తం ఓట్లలో 2.53 లక్షలు లేదా 54% అమెరికాలోని రెండు ఐపీ అడ్రస్ నుండి వచ్చాయని టి-ఆన్‌లైన్ ఇంటర్నల్ దర్యాప్తులో తేలింది. అయితే ఇదంతా ఎలాన్ మస్క్ సూచనల మేరకు జరిగి ఉండవచ్చని సూచిస్తుంది. ఇంకా సర్వే ఫలితాల్లో తారుమారు జరిగే అవకాశం ఉందని టి-ఆన్‌లైన్ చెబుతోంది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలను అనుసరించి సర్వేను తాత్కాలికంగా నిలిపివేసి సంబంధిత సమాచారాన్ని తొలగించింది.
టెస్లా కార్లకు నిప్పు :ఇటీవల దక్షిణ ఫ్రెంచ్ నగరమైన టౌలౌస్ సమీపంలో డజనుకి పైగా టెస్లా కార్లకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కుట్రలో భాగంగానే కార్లకు నిప్పు పెట్టారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన కూడా ఎలోన్ మస్క్ పట్ల పెరుగుతున్న ఆగ్రహం ఫలితంగానే జరిగిందని నమ్ముతారు. నిజానికి, మస్క్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, US ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ కోతలకు దారితీయడం, ఐరోపాలో మితవాద రాజకీయ అభిప్రాయాలకు మద్దతు ఇవ్వడం వంటి వాటిని చాలా మంది తిరస్కరించారు. దింతో అమెరికాలో కూడా టెస్లా పై నిరసనలు ఊపందుకున్నాయి ఇంకా బహిష్కరించాలని డిమాండ్లు పెరిగాయి.


Click it and Unblock the Notifications