UPI Payments: అత్యధికంగా జనాభా కలిగిన భారతదేశంలో చెల్లింపులను సులభతరం చేసింది డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. ఈ క్రమంలో యూపీఐ పేమెంట్స్ భారీ హిట్ అయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు విజయవంతమైన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను స్వీకరిస్తున్నాయి.
అయితే యూపీఐ చెల్లింపుల వ్యవస్థ మరో కోణం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావటం నగదు లావాదేవీలను చాలా సులభతరం చేసింది. ప్రజలు అధికంగా వినియోగిస్తున్న యూపీఐ పేమెంట్స్ ప్రజలు తమ డబ్బును ఖర్చు చేసే విధానంపై భారీ ప్రభావాన్ని చూపుతున్నట్లు వెల్లడైంది. రూపాయి నుంచి లక్ష వరకు ఎంత చెల్లించాలన్నా ప్రజలు ఫోన్ తీసి స్కాన్ చేసి చెల్లింపులు చేసేస్తున్నారు. నేరుగా నగదును వినియోగించటం చాలా వరకు తగ్గించేశారు.

అలాగే చిన్న కిరాణా దుకాణం నుంచి ఎక్కడికి వెళ్లినా ఏ వస్తువు కొనుగోలు చేసినా యూపీఐ చెల్లింపులు చేసేస్తున్నారు. యూపీఐ సూపర్ హిట్ అయిన తర్వాత జేబులో పర్సు పెట్టుకెళ్లటం చాలా మంది ప్రజలు మానేశారనటం అతిశయోక్తి కాదు. చిల్లర ఇబ్బందులు లేకుండా యూపీఐ చెల్లింపులు ప్రజలకు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీంతో యూపీఐ వినియోగం పెరిగి ప్రపంచంలోనే అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరిగే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిల్లీ యూపీఐ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. చాలా మంది ప్రజలు యూపీఐ, ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు నగదు బదిలీ ప్రక్రియను మునుపటి కంటే చాలా సులభతరం చేశాయని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు యూపీఐ చెల్లింపుల ద్వారా డబ్బును ఖర్చు చేస్తున్న తీరు విషయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేతితో డబ్బు ఖర్చు చేయకుండా యూపీఐ చెల్లింపుల వల్ల అనవసర ఖర్చులు ప్రజలు ఎక్కువగా చేస్తున్నట్లు వెల్లడైంది.
తాజా అధ్యయనం ప్రకారం UPI, ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం వల్ల భారతదేశంలో 75% మంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారని వెల్లడైంది. సర్వే ప్రకారం దాదాపు 81% మంది వ్యక్తులు రోజువారీగా UPI లావాదేవీలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే యూపీఐ వల్ల చెల్లింపులు సులభతరంగా మారాయని 91.5% మంది ప్రజలు వెల్లడించారు. ఇదే క్రమంలో వ్యక్తులు యూపీఐ ద్వారా సగటు రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. ఏప్రిల్ మాసంలో యూపీఐ లావాదేవీల సంఖ్య దేశంలో 1,330 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య 50 శాతం పెరిగింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications