Gold News: దాదాపు రెండు నెలల నుంచి పసిడి ధరలు సామాన్యులకు అంతుచిక్కని రీతిలో పెరిగిపోతున్నాయి. వాస్తవానికి డాలర్ బలపడుతున్నప్పుడు పసిడి రేట్లు తగ్గాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా కొనసాగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో బంగారం భారతీయ కుటుంబాలకు ఒక అందని ద్రాక్షగా మారుతుందా అనే భయాలు సైతం కలిగించింది రేట్ల ర్యాలీ.
గత ఏడాది నుంచి క్రమంగా పెరుగుతున్న పసిడి ధరల ర్యాలీ 2025లో కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో 24 క్యారెట్ల పసిడి గ్రాము రేటు 11 శాతం పెరిగి దాదాపు రూ.8600 స్థాయిల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల బెదిరింపులు ఆందోళనలు కలిగించటంతో అకస్మాత్తుగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. ట్రంప్ చర్యలతో ఏర్పడే ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇండియా, చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు సేఫ్ హెవెన్ పసిడిని కూడబెట్టుకుంటున్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం గోల్డ్‌తో రక్షణ గోడలు ఇవి నిర్మిస్తున్నాయి.

ఈ క్రమంలో రానున్న కొన్ని నెలల్లో గోల్డ్ రిటైల్ విక్రయ ధర 10 గ్రాములకు లక్ష మార్కును చేరుకుంటుందా అనే డిబేస్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న ధర నుంచి లక్ష మార్కును చేరుకోవటానికి పసిడి కేవలం 16 శాతం లేదా రూ.14,000 మాత్రమే దూరంలో ఉంది. ఇది అందుకోవటం అసాధ్యమైనది కాదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత స్థాయిలో పసిడి ధరల ర్యాలీ కొనసాగితే రానున్న కొన్ని నెలల కాలంలోనే గోల్డ్ రేటు రూ.లక్ష మార్కును చేరుకోవటం సులువేనని అంటున్నారు. మరోపక్క ఎంసీఎక్స్ లో పసిడి ధర మంగళవారం ఏప్రిల్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.86,360ని తాకి సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకేసింది.
వరుసగా పసిడి ధరల ర్యాలీ తర్వాత ప్రస్తుతం గోల్డ్ రేట్లు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా ధరలు తగ్గాయి. స్వల్పకాలిక ఫ్యూచర్స్ ట్రేడర్ల నుంచి లాభాల స్వీకరణను చూడటంతో ప్రస్తుతం రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయని కిట్కో మెటల్స్, సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జిమ్ వైకాఫ్ పేర్కొన్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ఏకీకృత 25 శాతం సుంకాన్ని అన్ని దేశాలపై విధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం మెరికాలో కష్టాల్లో ఉన్న పరిశ్రమలకు సహాయం చేస్తుందన్నారు. ఇదే క్రమంలో ఈ చర్య బహుళ-ముఖ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ అండ్ కమోడిటీ మార్కెట్లలోని పెట్టుబడిదారులు అమెరికాలో ద్రవ్యోల్బణం సమాచారంపై దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఫెడ్ చైర్ పావెల్ కూడా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవటానికి మరో త్రైమాసికం వేచి చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా భవిష్యత్తులో రేట్ల తగ్గింపుల చర్యలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవల పావెల్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను హడావిడిగా తగ్గించే ఆలోచనలో లేనట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగానే ఉందని అయితే ద్రవ్యోల్బణాన్ని 2 శాతం పరిమితిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications