Gold News: పసిడి ప్రియులకు షాకింగ్ వార్త.. త్వరలో రూ.70,000లకు గోల్డ్ ధర..!
Gold Rates: ఈ ఏడాది అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితులు పసిడి ధరల పెరుగుదలను ప్రేరేపించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు మంచి రాబడులను సైతం గోల్డ్ పెట్టుబడుల ద్వారా పొందారు.
ప్రస్తుతం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో 10 గ్రాములకు రూ.63,060 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే ధరలు మాత్రం ఇంకా పైపైకి పయనిస్తున్నాయి. కొత్త ఏడాది 2024లో పసిడి ధరల వెలుగులు కొనసాగి 10 గ్రాముల ధర రూ.70,000 మార్కును అందుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నాయి. స్థిరమైన రూపాయి, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం వంటివి దీనికి కారణంగా అభిప్రాయపడుతున్నారు.

కమోడిటీ స్టాక్ ఎక్స్ఛేంజ్ MCXలో ఎల్లో మెటల్ ధర 10 గ్రాములకు రూ.63,060గా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్ డాలర్‌తో రూపాయి 83 కంటే ఎక్కువ ట్రేడ్ అవుతున్న సమయంలో ఔన్స్ బంగారం రేటు 2,058 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 2023లో దేశీయంగా బంగారం ధరను పరిశీలిస్తే మే 4న 10 గ్రాముల రేటు రూ.61,845 వద్ద ఉంది. ఆ తర్వాత నవంబర్ 16న గోల్డ్ ధర రికార్డు స్థాయిలో రూ.61,914కు చేరుకుందని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు.
డిసెంబర్ 4న 10 గ్రాముల పసిడి ధర రూ.64,063 వద్ద ఉండగా.. కొత్త ఏడాదిలో మరింతగా పసిడి రేటు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశం న్యూ ఇయర్‌లో ఎన్నికలను ఎదుర్కొంటున్నందున.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తేలికగా మారే అవకాశం ఉన్నందున రూపాయి బలహీనపడవచ్చు. వారి పోర్ట్‌ఫోలియోలను పెంచడం వల్ల దేశీయంగా బంగారం ధరలను మరింత పెంచవచ్చని తెలుస్తోంది. 2024లో ఆర్థిక పరిణామాలతో పాటు బంగారం ధరల పథం ఎక్కువగా డాలర్ ఇండెక్స్, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది.


Click it and Unblock the Notifications