8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ వార్త.. 8వ వేతన సంఘం ఏర్పాలు వాయిదా..!
7h Pay Commission: చాలా కాలంగా దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు ఆసక్తిగా కొత్త వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కొన్ని రోజుల కిందట కేంద్రం నుంచి తీనిపై తీపి కబురు వచ్చింది. అయితే 8వ వేతన సంఘం ఏర్పాటు మరింత ఆలస్యం కానున్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో కోటి ఆశలతో ఉన్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
వాస్తవానికి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఏదైనా ప్రకటన చేస్తారని ఉద్యోగులందరూ భావించారు. కానీ ఈ అంశంపై నిర్మలమ్మ నుంచి ఒక్క మాట కూడా రాకపోవటంతో 1.20 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశకు గురయ్యారు. కానీ దీనికి కొన్ని రోజుల ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కొత్త వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఈ పరిణామాలను చూస్తుంటే వేతన సంఘం ఏర్పాటు మరింతగా ఆలస్యం అవనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రధాని మోదీ మాత్రం ఇద్దరు సభ్యులు, ఒక ఛైర్మన్‌తో ప్యానల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘానికి గడువు డిసెంబర్ 31, 2025తో ముగియనున్న వేళ దీని తర్వాత కొత్త సంఘం అమలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి నుంచి దీనికి సంబంధించి ప్రకటన చేయకపోవటంతో మరో బడ్జెట్ వరకు ఆగాల్సి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఉద్యోగులు తమ వేతన పెంపుల కోసం ఏడాది వేచి ఉండాల్సి రావొచ్చు. దీనికి ముందు 7వ వేతన సంఘం ఏర్పాటు సమయంలో కూడా కమిషన్ ఏర్పాటుకు చాలా సమయం పట్టింది.
ప్రయోజనం ఏంటి..?
వచ్చే సంవత్సరం నుంచి కొత్త వేతన సంఘం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్యూన్లు, అటెండర్లకు గతంలో రూ.18,000గా ఉన్న మూలవేతనం రూ.51,480కు పెరిగే పెరగవచ్చు. అలాగే సీనియర్ క్లర్క్, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి రూ.29,200గా ఉన్న బేసిక్ వేతనం రూ.83,512కు పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ ఏ స్థాయి అధికారుల వేతనం రూ.56,100 నుంచి రూ.1,60,446 బేసిక్ పెరుగుతుందని తెలుస్తోంది. ఇలాగే ఇతర కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సైతం పెరగవచ్చు.
ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉందని, ఇది ఉద్యోగుల బేసిక్ వేతనాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలోనూ 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో గణనీయమైన పురోగతిని కనిపించింది. 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం 2.57తో గుణించబడటంతో వారి ప్రాథమిక వేతనంలో 2.57 శాతం మేర పెరుగుదలకు కారణమైంది.


Click it and Unblock the Notifications