చాలా మంది సేవింగ్స్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (fixed deposits)ను ఆశ్రయిస్తుంటారు. బ్యాంకు FDలలో పెట్టుబడి పెట్టడం అనేది ఈ రోజుల్లో చాల పబ్లిసిటీ పొందింది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FD వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. అలాగే ఈ మార్పులు 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది.

అయితే బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, 1 నుండి 3 సంవత్సరాల కాలానికి వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది, ఇవి సాధారణ కస్టమర్లకి ఇంకా సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ మార్పుతో పాటు SBI ప్రత్యేక "అమృత్ వ్రిష్టి" ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని 444 రోజుల కాలపరిమితితో కొత్త రేట్లతో తిరిగి ప్రారంభించింది.
సీనియర్ సిటిజన్లకు FD వడ్డీ రేట్లు: ఈ వడ్డీ రేట్ల మార్పు తర్వాత SBI 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి డిపాజిట్లకు 3.50% నుండి 6.9% (ప్రత్యేక డిపాజిట్లు లేకుండా) వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4% నుండి 7.50% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.30% నుండి 7.20%కి తగ్గించింది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీ రేటు 7.50% నుండి 7.40%కి తగ్గించింది.
SBI అమృత్ వ్రిష్టి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ, 444 రోజుల కాలపరిమితి ఉన్న ప్రత్యేక పథకం "అమృత్ వృశ్చి"ని తిరిగి ప్రారంభించింది. ఈ పథకం 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పథకం ఇప్పుడు సాధారణ ప్రజలకు సంవత్సరానికి 7.05% అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
7 రోజుల నుండి 45 రోజుల వరకు FDలపై 3.50% వడ్డీ, 46 రోజుల నుండి 179 రోజుల వరకు FDలపై 5.50% వడ్డీ, 180 రోజుల నుండి 210 రోజుల వరకు FDలపై 6.25% వడ్డీ, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువకాల FDలపై 6.75% వడ్డీ సంపాదించవచ్చు. 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ కాల FD డిపాజిట్లకు అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లకు SBI 6.50% వడ్డీని ఎప్పటిలాగే మార్చకుండా ఉంచింది.
అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితిపై 7.20% వడ్డీ రేటు లభిస్తుంది, అంటే 7.30% వడ్డీ రేటు నుండి 10 బేసిస్ పాయింట్లు తక్కువ. అలాగే 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలనికి 7.40% వడ్డీ రేటు ఇస్తుంది, అంటే ప్రస్తుత 7.50% నుండి తగ్గింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications