బలవంతపు రాజీనామాలతో ఉద్యోగుల్లో ఆందోళన..నోటీస్ పిరియడ్ లేకుండానే...

2025 సంవత్సరంలో ఐటీ ఉద్యోగ రంగాన్ని ఒక ఊహించని దెబ్బ తాకింది. టెక్ నుండి ఫైనాన్స్‌ వరకు, చిన్న కంపెనీల నుంచి గ్లోబల్ కార్పొరేట్ సంస్థల వరకు ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో, LayoffGuard అనే ఉద్యోగ సహాయ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన తాజా రిపోర్టు,ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనుభవాలను బయటపెట్టింది.

PIP LayoffGuard IT jobs layoffs job security forced resignation notice period severance pay Performance Improvement Plan PIP LayoffGuard report mental stress

LayoffGuard రిపోర్టు ప్రకారం, 2025లో 54% మంది ప్రొఫెషనల్స్ బలవంతపు రాజీనామి పరిస్థితిని ఎదుర్కొన్నారు. వీరిలో చాలామందిని స్వచ్ఛందంగా రాజీనామా చేయించేందుకు తట్టుకోలేని పని ఒత్తిడి, అసాధ్యమైన టార్గెట్లు, నిరంతర మెరుగుదల పేరుతో ఒత్తిడిలో పెట్టడం వంటి పద్ధతులు పాటించబడ్డాయి. ఎక్కువగా కన్సల్టింగ్ రంగాల్లో (ఉదా: WNS, EMC, Ascendion) ఉన్న మేనేజీరియల్ ఉద్యోగులు దీని బారినపడ్డారు.

రిపోర్టు ప్రకారం, 13% మంది ఉద్యోగులు నోటిస్ పీరియడ్ మోసాలు ఎదుర్కొన్నారు. కొంతమందిని ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తీసేసి, నోటిస్ పీరియడ్ జీతం ఇవ్వకుండా ఉంచడం జరిగింది. టెక్ రంగంలో సాధారణంగా 60-90 రోజుల నోటిస్ పీరియడ్ ఉండగా, కన్సల్టింగ్ రంగాల్లో 30-60 రోజులు నిబంధనగా ఉంది. కానీ ఫైనాన్స్ రంగంలో 90+ రోజుల నోటిస్‌ను ఉద్యోగిని నిలుపుకునేందుకు ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు.

లేఆఫ్ సమయంలో సేవరెన్స్ పే (విడిచే జీతం) పట్ల కూడా అన్యాయం జరుగుతోందని రిపోర్టు చెబుతోంది. సీనియర్ ఉద్యోగుల‌కు సాధారణంగా 3-6 నెలల జీతం, మధ్యస్థ రోల్స్‌కు 1-3 నెలలు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు కనీసం నోటిస్ పీరియడ్ జీతం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిలో చాలా కంపెనీలు తప్పుగా లెక్కించడం లేదా ఆలస్యం చేయడం జరుగుతోందని లేఆఫ్‌గార్డ్ హెచ్చరించింది.

నిజమైన పనితీరు మెరుగుదల కోసమే ఇవ్వాల్సిన Performance Improvement Plan (PIP) ను కొంతమంది ఉద్యోగులను మృదువుగా తొలగించేందుకు ఒక టూల్‌గా మారుస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

టెక్ దిగ్గజాల్లో భారీ లే ఆఫ్స్
ఈ వివరాలు, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇంటెల్ లాంటి కంపెనీలలో భారీగా లే ఆఫ్స్ జరుగుతున్న నేపథ్యంలో వచ్చాయి. టీసీఎస్ ఇప్పటికే 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 15,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. దీనికి ప్రధాన కారణం AI మైన ఇన్వెస్ట్‌మెంట్లు, టెక్నాలజీ ఆధారిత మార్పులే అని కంపెనీలు పేర్కొన్నాయి.

ఉద్యోగ భద్రతపై అస్థిరత, ఎప్పుడెప్పుడు ఉద్యోగం పోతుందో అన్న భయం చాలా మంది ఉద్యోగుల్లో నెలకొంటోంది. ఎటు వెళ్లినా లేఆఫ్స్, రాజీనామాలకు బలవ్వడం వంటి వార్తలు వింటుండటంతో, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అసంతృప్తితో ఉంటున్నారు. ఈ ఆందోళనలు మానసికంగా తీవ్ర ఒత్తిడికి దారి తీస్తున్నాయి. కొందరికి డిప్రెషన్ వచ్చేస్తుంటే, మరికొందరికి తమ పనితనంపై, విలువపై అనుమానం కలుగుతోంది. సెల్ఫ్-వెల్యూ కోల్పోవడం వల్ల పనిలో ఏకాగ్రత తగ్గడం, వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితమవడం వంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగ భద్రతా విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల, అనేక మంది ఉద్యోగులు మానసికంగా అశాంతిగా జీవించాల్సి వస్తోంది.

ఈ లేఆఫ్‌ల తీరును చూస్తుంటే ఉద్యోగ భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. బలవంతపు రాజీనాములు, నోటిస్ పీరియడ్ మోసాలు, సేవరెన్స్ పేఅవుట్ వివాదాలు ఇవన్నీ ఉద్యోగులపై తక్కువ గౌరవాన్ని చూపిస్తున్న సంకేతాలే. ఈ తరుణంలో ఉద్యోగులకు హక్కులపై అవగాహన, మరియు న్యాయపరంగా నడవడానికి సరైన మార్గదర్శనం అవసరం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+