Home Rents: ప్రస్తుతం భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నిరంతరం నగరాలకు మైగ్రేట్ అవుతున్నారు. నగరాల్లో మెరుగ్గా ఉంటున్న ఉపాధి అవకాశాలు దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కారణంగా నెలనెల ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోతున్నాయి.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2024లో ఇంటి అద్దెలు నెలవారీ ప్రాతిపధికన 9-21 శాతం మేర పెరుగుదలను నమోదు చేశాయని ప్రముఖ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. దీనికి కారణమైన ముఖ్య కారణాలను గమనిస్తే.. ఉపాధి అవకాశాల కారణంగా నగరాలకు ప్రజల వలసలు, నాణ్యమైన వసతి అవకాశాలు లేకపోవడం లేదా తక్కువగా ఉండటం, మెరుగైన సౌకర్యాల కోసం ప్రీమియం చెల్లించాల్సి రావటం వంటి అంశాలను నిపుణులు కారణాలుగా చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇంటి అద్దెల పెరుగుదలను ప్రభావం ఎక్కువగా నోయిడాలోని సెక్టార్ 150 ప్రాంతంలో నమోదైంది. దీని తర్వాత ముంబై చెంబూర్ ప్రాంతం తక్కువ అద్దెల పెరుగుదలను చూసింది. ప్రధానంగా చెన్నై, ముంబై నగరాలు మినహా ఇతర మెట్రో ప్రాంతాలు ఇంటి అద్దెల పెరుగుదల విషయంలో రెండంకెల వృద్ధిని సాధించాయి. చెన్నై ప్రాంతంలో ఇంటి అద్దెలు 9-10 శాతం మధ్యలో పెరుగుదలను చూశాయని తాజా అనరాక్ డేటా వెల్లడించింది. అయితే 2025లో కొత్త ఇళ్ల సరఫరా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున.. అద్దెలు కూడా స్థిరీకరించబడతాయని భావిస్తున్నారు.
బెంబేలెత్తిస్తున్న బెంగళూరు..
ఇండియాలో ఐటీ పరిశ్రమతో పాటు స్టార్టప్ కంపెనీలకు పెట్టింది పేరు బెంగళూరు నగరం. ఇక్కడ నిరంతరం కొత్తగా అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇప్పటికే ఉన్న ఐటీ సంస్థలు విస్తరణ బాట పట్టడం నగరానికి ప్రజల వలసలను నిరంతరం పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో బెంగళూరు సర్జాపూర్ ప్రాంతంలో సగటున అద్దెలు 2024లో 16.4 శాతం పెరుగుదలను చూడటం గమనార్హం. ఇదే క్రమంలో నగరంలోని తనిసంద్రలో 11 శాతం వృద్ధిని చూశాయి. దీంతో నగరంలో ఇప్పటికే అద్దెలు అధికంగా ఉండటం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బందిగా మారుతోంది. ప్రజలు సంపాదిస్తున్న దానిలో దాదాపు సగం ఇంటి నిర్వహణకు ఖర్చవుతోందని నివేదించబడింది.
ఇలాంటి పరిస్థితుల్లో కన్జూమర్ గూడ్స్ తయారీ సంస్థలు నగరాల్లోని ప్రజల నుంచి డిమాండ్ తగ్గటాన్ని చూస్తున్నాయి. దీనికి కారణం ప్రజల చేతిలో ఖర్చుచేయటానికి ఆదాయం తక్కువగా మిగలటమేనని వెల్లడైంది. అద్దెలకు ఉంటున్న ప్రజలు ఇంటి ఖర్చుల కారణంగా అత్యవసరం కాని వాటిపై ఎక్కువగా ఖర్చు చేయటానికి ఇష్టపడటం లేదని తేలింది. ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటి అద్దెల పెరుగుదలకు సప్లై డిమాండ్ మధ్య వ్యత్యాసం కూడా కారణంగా రియల్టీ నిపుణులు చెబుతున్నారు. గడచిన 4-5 ఏళ్లుగా అద్దె ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ అద్దెల పెరుగుదలకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications