IT News: ఏరికోరి ఎంచుకున్న ఐటీ ఉద్యోగాలు ప్రస్తుతం యువతను పిచ్చివాళ్లుగా మారుస్తున్నాయి. బయట చెప్పుకుంటున్నదానికి లోపల కంపెనీల్లో జరుగుతున్నదానికి అస్సలు సంబంధం ఉందటం లేదని తాజా డేటా చెబుతోంది. దీనికి తోడు వారి మానసిక ఆరోగ్యం సైతం భారీగా ప్రభావితం అవుతోంది.
ఐటీ సేవల రంగం భారతదేశంలో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో అశాంతికరమైన ధోరణి వెలుగులోకి వచ్చింది. టెక్ ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే అధిక గంటలు పనిచేస్తున్నారని వెల్లడైంది. వారంలో 45 నుంచి 50 గంటల పాటు ఆఫీసుల్లో పనికి వెచ్చిస్తున్నట్లు తేలింది. పరిశ్రమ మెుత్తం ఇదే పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దీనికి కొన్ని వారాల ముందట ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి యువత 70 గంటలు వారానికి పనిచేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

టెక్ కంపెనీల్లో దగ్గర పడుతున్న ప్రాజెక్టు గడువులను చేరుకోవటానికి ఉద్యోగులపై పెద్దఎత్తున ఒత్తిడి ఉందని తెలుస్తోంది. వాస్తవ ఉత్పాదకతపై దృష్టి సారించడానికి బదులుగా గంటల లెక్కింపుపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీల ఆదాయాలు గడచిన ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నప్పటికీ నిపుణులైన ఉద్యోగుల కొనసాగుతోంది. ఉద్యోగులపై కంపెనీలు వెచ్చిస్తున్న ప్రతి రూపాయికి రూ.1.8 నుంచి రూ.1.9 రాబడిని అందుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో రెవెన్యూ ప్రొడక్టివిటీ- ఉద్యోగులకు చేస్తున్న ఖర్చు మధ్య పొంతన అస్సలు కుదరటం లేదని వెల్లడైంది.
గడచిన ఐదేళ్ల కాలంలో టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ ఒక్కో ఉద్యోగి ఆదాయం 3.8-11 శాతం తగ్గుముఖం పట్టింది. అయితే అసలు భారత ఐటీ రంగాన్ని ఇబ్బంది పెడుతున్న అసలు విషయం వర్క్-లైఫ్ బ్యాలెన్స్. టీమ్ లీజ్ డిజిటల్ డేటా ప్రకారం సగటున 58 శాతం మంది భారతీయ టెక్ ఉద్యోగులు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో అనేక జంటలు విడాకులు తీసుకోవటం, అధిక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం వంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications