చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసంతృప్తి వెళ్లగక్కిన ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్స్ పై చైనా మరోసారి తన ప్రతాపం చూపించింది. చైనా ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్ మా ఇప్పుడు తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి వస్తోంది. తాజాగా అలీబాబా సంస్థపై చైనా మార్కెట్ నియంత్రణా సంస్థ 2.78 బిలియన్ డాలర్ల మేర భారీ జరిమానా విధించింది.

ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్లు జరిమానా
గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై చైనా నియంత్రణదారులు ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్లు జరిమానా విధించారు. పాలక కమ్యూనిస్ట్ పార్టీ చైనా యొక్క అతిపెద్ద ఇ-కామర్స్ మరియు ఇతర ఇంటర్నెట్ కంపెనీలపై నియంత్రణను కఠినతరం చేస్తోంది . పోటీని అరికట్టడానికి తమ పరిశ్రమ ఆధిపత్యాన్ని ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఆన్‌లైన్ రిటైలింగ్‌లో పోటీని పరిమితం చేయడానికి అలీబాబా తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు జరిమానా విధించినట్లు పేర్కొంది .

తమ వ్యాపారులు వేరే ఈ కామర్స్ పోర్టల్స్ తో ఒప్పందాలు చేసుకోకూడదని ఒత్తిడి ఆరోపణలు
స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ఈ విషయాన్ని శనివారం ప్రకటించింది.
అలీబాబా తన ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే మొత్తం వస్తువుల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తమ గ్రూప్ కు చెందిన ఈ కామర్స్ పోర్టల్స్ లో ఉత్పత్తులను విక్రయించాలి అనుకునే వ్యాపారులు తమతోనే కొనసాగాలని, తమ ప్రత్యర్థి ఈ కామర్స్ పోర్టల్స్ తో ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ఆలీబాబా యాజమాన్యం ఒత్తిడి తెస్తోందన్న అంశంపై విచారణ జరిపిన చైనా మార్కెట్ రెగ్యులేటరీ కమిటీ ఈ జరిమానా విధించింది.

విచారణ జరిపి భారీ ఫైన్ వేసిన చైనా మార్కెట్ రెగ్యులేటరీ కమిటీ
2019లో ఆలీబాబా గ్రూప్ చేసినన 455.7 బిలియన్ యువాన్ ల వ్యాపారంలో నాలుగు శాతం జరిమానా చెల్లించాలని రెగ్యులేటరీ స్పష్టం చేసింది.
చైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల తాకట్టు దుకాణాల మనస్తత్వాలను వీడాలని గతంలో జాక్ మా చైనా ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వెళ్లగక్కారు . ఈ నేపథ్యంలో అప్పటినుండి జాక్ మా పై చైనా అధినాయకత్వం విషం చిమ్ముతూ నే ఉంది. ఎక్కడికక్కడ జాక్ మా వ్యాపారాలపై, కఠినమైన ఆంక్షలు విధిస్తూ జాక్ మాను కిందికి నెట్టింది.

జాక్ మా ను అణచివేస్తున్న చైనా సర్కార్ .. జాక్ మా వ్యాఖ్యల ఎఫెక్ట్
ఆయన సంస్థల పై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించింది. దీంతో జాక్ మా కుబేరుల జాబితా నుండి కింద పడి పోవడమే కాకుండా , కొంతకాలం బాహ్యప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారు. ఏడాది క్రితం తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆలీబాబా మరియు యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు చైనా కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయారు. తిరిగి ఒక వర్చువల్ సమావేశంలో కనిపించే వరకు జాక్ మా ఆచూకీ పై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications