భారతీయ IT రంగం ఎప్పటినుంచో అమెరికా మీదే ఆధారపడింది. TCS, Infosys, Wipro లాంటి కంపెనీలు తమ బిజినెస్‌లో 50%కు పైగా ఆదాయాన్ని అమెరికా నుంచే సంపాదిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా సెనేట్‌లో వచ్చిన కొత్త ప్రతిపాదన "HIRE Act 2025" ఈ IT రంగానికి గట్టి షాక్ ఇవ్వబోతుందేమో అన్న భయం మొదలైంది.

బిల్లు ఏమంటుంది?
అమెరికా కంపెనీలు భారత్ లాంటి దేశాలకు IT సర్వీసుల కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ పేమెంట్‌పై "25% అదనపు పన్ను"వేస్తారు. అంతే కాదు, ఆ పేమెంట్‌ను కంపెనీలు ఇన్‌కమ్ టాక్స్‌లో ఖర్చు గా చూపించుకోవడానికి కూడా వీలు ఉండదు. అంటే డబుల్ పన్ను భారం. అదనంగా, ఈ పన్ను నుంచి వచ్చే డబ్బును అమెరికా ఉద్యోగులకు ట్రైనింగ్, అప్రెంటిస్‌షిప్స్ కోసం ఖర్చు చేస్తారు. అంటే "అమెరికా ఉద్యోగాలకు ప్రాధాన్యం" అన్నది బిల్లులో క్లియర్ మెసేజ్.
ఎందుకు ఇది పెద్ద ఇష్యూ?
ఒక ఉదాహరణ తీసుకుంటే అమెరికా కంపెనీ ఒక ప్రాజెక్ట్ కోసం భారత్‌కి $100 చెల్లిస్తే, అదనంగా $25 పన్ను పడుతుంది. అలాగే టాక్స్‌లో తగ్గింపు లేకపోవడంతో మరో $21 అదనపు పన్ను పడుతుంది. మొత్తానికి ఖర్చు దాదాపు 46% ఎక్కువ అవుతుంది. ఇది పెద్ద కంపెనీలకే కాదు, అమెరికా స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లతో పనిచేసే చిన్న డెవలపర్లకు కూడా వర్తించవచ్చు.
ఇండియా మీద ఎలాంటి ప్రభావం?
1. ధరల పునర్నిర్వచనం: ఇప్పటివరకు అమెరికా కంపెనీలకు భారత్‌లో పని చేయించుకోవడం తక్కువ ఖర్చుతో, లాభదాయకంగా అనిపించేది. కానీ ఈ కొత్త పన్ను వస్తే "ఇక్కడ పని చేయించుకుంటే ఖర్చు 40-50% ఎక్కువ అవుతోంది" అని వారు లెక్క వేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆ కంపెనీలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తాయి. ఉదాహరణకు కెనడా, మెక్సికో వంటి దేశాల్లో ఆఫీసులు పెంచి, అక్కడి నుంచే పని చేయించుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అంటే మన దగ్గరికి వచ్చే ప్రాజెక్టులు కొంతవరకు తగ్గే ప్రమాదం ఉంది.
2. కాంట్రాక్ట్ కఠినత్వం: ఇప్పటివరకు కాంట్రాక్టుల్లో "ఈ పని అమెరికా కస్టమర్ల కోసం, ఇది ఇతర మార్కెట్ల కోసం" అనే స్పష్టత అంతగా అవసరం లేకపోయింది. కానీ ఈ బిల్లు చట్టమైతే, ప్రతి చిన్న డీటైల్ రాసి పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక యాప్ డెవలప్ చేస్తే, అది US యూజర్లకేనా, లేక గ్లోబల్ యూజర్లకూ వాడతారా? అన్నది కాంట్రాక్ట్‌లో స్పష్టంగా రాయాలి. లేకపోతే టాక్స్ అధికారులు "ఇది అమెరికా కస్టమర్లకే కదా" అని పన్ను వేసే అవకాశం ఉంటుంది. దీని వలన కాంట్రాక్ట్‌లు మరింత కఠినంగా మారతాయి.
3. AI వాడకం పెరుగుతుంది: ఖర్చు తగ్గించుకోవడానికి అమెరికా కంపెనీలు "మనిషిని ఎందుకు పెట్టాలి, AI సాఫ్ట్‌వేర్ వాడదాం" అని ఆలోచిస్తాయి. ముఖ్యంగా కస్టమర్ కేర్ కాల్స్, చాట్‌బాట్స్, టెస్టింగ్, డేటా ఎంట్రీ లాంటి పనుల్లో AI మరింత వాడకం పెరుగుతుంది. ఇప్పటికీ చాలావరకు కంపెనీలు AIని వాడుతున్నాయి కానీ, ఈ కొత్త పన్ను వల్ల ఆ ప్రాసెస్ మరింత వేగవంతం అవుతుంది. దీని వలన భారతీయ యువతకు లభించే ఎంట్రీ-లెవల్ IT ఉద్యోగాలు తగ్గిపోవచ్చు.
4. భారత్‌లో జీతాల ఒత్తిడి: ఇప్పటివరకు అమెరికా కంపెనీలు భారతీయ కంపెనీలకు ఎక్కువ మొత్తంలో చెల్లించేవి. కానీ పన్ను వల్ల ఖర్చు పెరిగిపోతే, "మీరు రేట్లు తగ్గించాలి" అని ఒత్తిడి తెస్తాయి. అప్పుడు భారతీయ కంపెనీలు ప్రాజెక్ట్‌లను కాపాడుకోవడానికి తక్కువ ధరకు ఒప్పుకోవాల్సి వస్తుంది. దాని ప్రభావం డైరెక్ట్‌గా ఉద్యోగుల మీద పడుతుంది - జీతాల పెంపు నెమ్మదవ్వడం, కొత్త రిక్రూట్‌మెంట్ తగ్గిపోవడం జరుగవచ్చు.
కంపెనీలు ఇప్పుడు కొత్త టెక్నాలజీలలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాయి. అలాగే నాన్-US మార్కెట్లలో, ముఖ్యంగా యూరప్, ఆసియా దేశాల్లో తమ బిజినెస్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అదే సమయంలో పూర్తిగా భారత్‌పైనే ఆధారపడకుండా, హైబ్రిడ్ మోడల్‌లో పనిచేయడానికి ఇష్టపడతాయి. అంటే కొంత పని అమెరికాలోనే ఉంచి, మిగతా భాగం భారత్‌లో చేయించుకునే విధంగా మిక్స్ మోడల్‌ను ఫాలో అవుతాయి.
ఈ కొత్త పన్ను ప్రభావం భారత IT రంగంలోని అన్ని విభాగాలపై ఒకేలా ఉండదు. IT సేవలు, అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేసే పెద్ద కంపెనీలు (TCS, Infosys, Wipro, HCLTech, Tech Mahindra) ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది, ఎందుకంటే వీటి ఆదాయంలో సగానికి పైగా అమెరికా నుంచే వస్తోంది. ఇక BPM, కాల్ సెంటర్లు అయితే మరింత టార్గెట్ అవుతాయి, ఎందుకంటే ఇవి నేరుగా అమెరికా వినియోగదారులకు సర్వీసులు అందిస్తాయి. ప్రొడక్ట్ ఇంజినీరింగ్, R&D రంగంలో ప్రభావం మాత్రం ప్రాజెక్ట్ ఔట్‌పుట్‌పై ఆధారపడి ఉంటుంది - అది నేరుగా అమెరికా కస్టమర్లకు వాడుకలో ఉంటే పన్ను వర్తించే ఛాన్స్ ఎక్కువ, లేకపోతే అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. మరోవైపు స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లు కూడా ఈ పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా అమెరికా కోసం యాప్‌లు, వెబ్‌సైట్లు డెవలప్ చేసే గ్లోబల్ ఫ్రీలాన్సర్లకు ఇది పెద్ద సవాలుగా మారవచ్చు.
అమెరికాలో ఎన్నికల వాతావరణం చాలా జోరుగా ఉంది. స్థానిక ఉద్యోగాలను కాపాడాలని నాయకులు మాటలు చెబుతున్నారు. ఈ బిల్లు కూడా అదే కోణంలో ఉంది. కానీ కాంగ్రెస్‌లో ఎంతవరకు ఇది ముందుకు వెళుతుందో, ఎలాంటి మినహాయింపులు వస్తాయో చూడాలి.
భారతీయ IT రంగం $100 బిలియన్ ఎగుమతులు అమెరికా పైనే ఆధారపడి ఉంది. HIRE Act 2025 నిజంగా చట్టమైతే, ఖర్చులు పెరిగి, వ్యూహాలు పూర్తిగా మారిపోవాలి. అయితే అదే సమయంలో ఇది ఇండస్ట్రీకి కొత్త దిశలు, కొత్త మార్కెట్లను అన్వేషించే ఛాన్స్ కూడా ఇస్తుంది.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications