ఈ మధ్యకాలంలో అసలు బంగారం, వెండి కొనేట్టు లేదు. ఇటీవలే కాస్త రేట్లు తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగి వినియోగదారులకు షాక్ నిచ్చాయి. మళ్లీ బంగారం ధర పెరిగింది. దేశీయ మార్కెట్లో వరుసగా మూడో సెషన్‌లో గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు తగ్గగా, గత 3-4 రోజులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరిగి ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గుతున్నా.. దేశీయంగా మాత్రం వీటి ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం రండి..
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 250 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 67,100 వద్ద కొనసాగుతోంది. ఇక గత 2 సెషన్లలో కూడా రూ. 200, రూ. 250 చొప్పున పెరిగింది. మొత్తం 3 సెషన్లలోనే రూ. 700 పెరగడం విశేషం. ఇక 24 క్యారెట్స్ పసిడి ధర తులంపై రూ. 270 పెరిగి ప్రస్తుతం రూ. 73,200 వద్ద చేరింది. ఇక, ఢిల్లీలో కూడా పసిడి ధరలు ఆకాశన్నాంటాయి. ఇక్కడ 22 క్యారెట్స్ రేటు 10 గ్రాములు రూ. 250 పెరిగి రూ. 67,250 వద్ద కొనసాగగా, 24 క్యారెట్ల ధర రూ. 270 పెరిగి తులం రూ. 73,350 వద్ద ఉంది. విజయవాడలో అయితే, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 74,200 కాగా.. 22 క్యారెట్స్ రూ. 68,800 వద్ద ఉంది. ప్రొద్దుటూరులో వీటి ధరలు వరుసగా చూస్తే.. రూ. 72,950, రూ. 67,640 వద్ద ఉంది. అదే రాజమండ్రి పరిస్థతి చూస్తే రూ. 72,590, రూ. 67,200 వద్ద కొనసాగుతోంది. వైజాగ్‌లో రూ. 72,940, రూ. 72,650 గా ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు..
ఇక, గోల్డ్ రేట్‌తో పాటు వెండి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో వెండి ధర ఒక్కరోజే రూ. 1200 పెరిగి ప్రస్తుతం కేజీకి రూ. 97,700 మార్కు వద్దకు చేరింది. హైదరాబాద్‌లో అయితే రూ. 1200 పెరగ్గా ప్రస్తుతం కిలో వెండి రేటు ఇక్కడ రూ. 1,02,200 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఔన్సుకు 2334.90 డాలర్ల వద్ద కొనసాగగా, ఇది గతంతో పొలీస్తే భారీగా తగ్గింది. ప్రస్తుత వెండి ధర 31.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications