Multibagger Stock: లక్షను రూ.3 కోట్లు చేసిన స్టాక్.. మీ దగ్గర కూడా ఉందా..?
Multibagger Stock: మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో దీర్ఘకాలం పెట్టుబడుల సంపద ఎలా రెట్టింపు అవుతుందో ఈ స్టాక్ నిజం చేసింది. మల్టీబ్యాగర్ రాబడులతో ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పుటు మనం మాట్లాడుకోబోతున్నది శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్ అనే స్మాల్ క్యాప్ కంపెనీ షేర్ల గురించే. గత పదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చాయి. అప్పట్లో ఒక్కో షేరు ధర రూ.2 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ రూ.550కి పైన ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులకు 31000% కంటే ఎక్కువ రాబడిని అందించింది.

ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.3 కోట్లను దాటి ఉండేది. శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్ షేర్లు ఆగస్టు 21, 2013న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో రూ.1.75 వద్ద ఉన్నాయి. కంపెనీ షేర్లు 25 ఆగస్ట్ 2023న BSEలో రూ.556.30కి చేరుకున్నాయి. ఒక వ్యక్తి 10 ఏళ్ల క్రితం ఈ కంపెనీ షేర్లలో కనీసం రూ.10,000 ఇన్వెస్ట్ చేసి తన పెట్టుబడిని కొనసాగించినట్లయితే.. దాని షేర్ల ప్రస్తుత విలువ రూ.31.78 లక్షలుగా ఉండేది.
గడచిన మూడేళ్ల కాలంలో స్టాక్ ధర 1900 శాతం కంటే ఎక్కువ జంప్ చేసి అద్భుతమైన వృద్ధిని సాధించింది. 4 సెప్టెంబర్ 2020న BSEలో కంపెనీ షేర్లు రూ.27.10 వద్ద ఉన్నాయి. అలాగే ఆగస్ట్ 25, 2023న BSEలో శివాలిక్ బైమెటల్ కంట్రోల్స్ షేర్ రూ.556.30 వద్ద ముగిసింది. గత 3 ఏళ్లలో కంపెనీ షేర్లు 1953% రాబడిని ఇన్వెస్టర్లకు అందించాయి. స్టాక్ 52 వారాల ధర గరిష్ఠ స్థాయి రూ.730 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.359.40గా ఉంది. పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించిన ఇన్వెస్టర్లు స్టాక్ నుంచి బంపర్ లాభాలను పొందారు.


Click it and Unblock the Notifications