IPO News: ఐపీవో పేలుడు లిస్టింగ్.. తొలిరోజే 200 శాతం లాభం.. మీరూ బెట్టింగ్ వేశారా?

Shivalic Power IPO: జూలై నెల మెుదటి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక పక్క లాభాల్లో కొనసాగుతుండగా.. మరోపక్క ఐపీవోల లాభాల కోలాహలం కొనసాగుతోంది. చిన్న ఐపీవోలు సైతం చిచ్చర పిడుగుల్లా చెలరేగిపోతూ ఇన్వెస్టర్లకు మెుదటిరోజూ సూపర్ లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శివలిక్ పవర్ కంట్రోల్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు నేడు మార్కెట్లోకి అడుగుపెట్టి బలమైన జాబితాను నమోదు చేశాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 211 శాతం ప్రీమియం ధరతో రూ.311 రేటు వద్ద ఒక్కో షేరు మార్కెట్లోకి అడుగుపెట్టింది. లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు మరింతగా పెరిగి ఇంట్రాడేలో రూ.325.90 రేటుకు చేరుకున్నాయి. దీంతో ఐపీవోలో దరఖాస్తు చేయగా షేర్లను అందుకున్న పెట్టుబడిదారులు భారీ లాభాన్ని ఆర్జించారు. ఐపీవో జూన్ 24 నుంచి జూన్ 26 వరకు రిటైల్ పెట్టుబడిదారుల కోసం అందుబాటులో ఉంది.

Shivalic Power IPO made bumper listing on first day investors gained over 200 percent

వాస్తవంగా కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.95 నుంచి రూ.100గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. దీనిప్రకారం ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం రూ.1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.64.32 కోట్లను నేడు విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.18.29 కోట్లను జూన్ 21న సమీకరించింది. వీరికి జారీ చేసిన పెట్టుబడులకు 50 శాతానికి 30 రోజులు మిగిలిన 50 శాతానికి 90 రోజులు లాక్ ఇన్ పిరియడ్ ఉంటుందని వెల్లడైంది

ఐపీవో మూడు రోజుల ఇష్యూ సమయంలో ఏకంగా 300 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. కంపెనీ ప్రమోటర్లుగా అమిత్ కన్వర్ జిందాల్, సప్నా జిందాల్ ఉన్నారు. తాజా ఐపీవోకి ముందు కంపెనీలో ప్రమోటర్ల మొత్తం వాటా 96.63 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 70.86 శాతానికి తగ్గింది. 2004లో ప్రారంభించబడిన కంపెనీ ఎలక్ట్రిక్ ప్యానెల్స్ తయారీ వ్యాపారంలో ఉంది.

కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో PCC ప్యానెల్స్, IMCC ప్యానెల్స్, స్మార్ట్ ప్యానెల్స్, MCC ప్యానెల్స్, DG సింక్రొనైజేషన్ ప్యానెల్స్, అవుట్‌డోర్ ప్యానెల్స్, 33KV వరకు ఉన్న HT ప్యానెల్స్, VFD ప్యానెల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లు, బస్ డక్ట్, LT & HT APFC ప్యానెల్స్ ఉన్నాయి. నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటుగా.. ఆఫ్రికన్ దేశాలైన ఉగాండా, కెన్యా, నైజీరియా, అల్జీరియాతో సహా భారతదేశంలోని 15 పారిశ్రామిక రంగాలకు కంపెనీ ఈ ప్యానెల్‌లను అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+