Hurun Philanthropy List: దాతృత్వంలో శివ్‌నాడాన్ ఫస్ట్ ర్యాంక్.. మరి అంబానీ-అదానీ ఎక్కడ..?

Shiv Nadar: ప్రతి ఏటా దేశంలోని దాతృత్వవేత్తలు దేశంలో ఎంత విరాళాలుగా అందిస్తున్నారనే వివరాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఎడెల్‌గివ్-హురున్ ఇండియా దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం వివరాలు బయటపడ్డాయి.

దాతృత్వానికి విరాళాలు అందిస్తున్న వారిలో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడాన్ వరుసగా మూడోసారి తొలిస్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నాడార్ రోజుకు సగటున రూ.6 కోట్ల వరకు విరాళానికి అందించినట్లు వెల్లడైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో శివ్‌నాడార్ రూ.2,153 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు 5 శాతం అధికంగా వెల్లడైంది. నాడార్ ఫౌండేషన్ విద్య, కళలు, సంస్కృతి వంటి అంశాలపై ఈ సొమ్మును వెచ్చిస్తుంది. ఇక ఇదే క్రమంలో రెండవ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇదే కాలంలో రూ.407 కోట్లను దాతృత్వానికి అందించి రెండవ స్థానంలో నిలిచారు.

Shiv Nadar Tops edelgive Hurun Philanthropy List with 2153 crores donation ambani in 2nd place

దాతృత్వం విషయంలో బజాజ్ ఫ్యామిలీ మూడో స్థానంలో నిలిచి గత ఆర్థిక సంవత్సరం కంటే 33 శాతం అధికంగా రూ.352 కోట్లను వెచ్చించింది. ఇక బిర్లా గ్రూపుకు చెందిన కుమారమగళం బిర్లా ఫ్యామిలీ నాలుగో స్థానంలో కొనసాగుతూ రూ.334 కోట్లను విరాళాల రూపంలో సమాజ సేవకు అందించింది. అందరూ ఎదురుచూస్తున్న గౌతమ్ అదానీ ఫ్యామిలీ దాతృత్వం విషయంలో ఐదవ స్థానంలో నిలిచి ఆర్థిక సంవత్సరంలో రూ.330 కోట్లను సమాజానికి సేవ చేసేందుకు విరాళంగా అందజేసింది.

ఇక హురున్ లిస్ట్ ప్రకారం రూ.5 కోట్ల కంటే ఎక్కువ విరాళంగా అందించిన వారు ఏకంగా 203 మంది ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని రూ.307 కోట్లు, అతని భార్య రోహిణి నీలేకని రూ.154 కోట్లను విరాళాల రూపంలో అందించారు. కృష్ణ చివుకుల ఐఐటీ మద్రాసుకు రూ.228 కోట్లు అందించారు. అనిల్ అగర్వాల్ తన ఫౌండేషన్ ద్వారా రూ.181 కోట్లను అందిచారు. ఇదే క్రమంలో సంపద విషయానికి వస్తే.. శివ్‌నాడార్ రూ.3.14 లక్షల కోట్ల ఆస్తులతో సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అదానీ సంపద రూ.11.6 లక్షల కోట్లు, అంబానీ సంపద రూ.10.14 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+