bonus: ఈ కంపెనీ బోనస్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.. ఏకంగా ఐదేళ్ల జీతాలను బోనస్ గా..

bonus: ఎక్కడ చూసినా లేఆఫ్ ల మోత మోగిపోతోంది. ఒక్క IT రంగమే కాకుండా వివిధ విభాగాలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అయితే ఇటువంటి క్లిష్ట సమయాల్లోనూ ఓ కంపెనీ ఇచ్చిన బోనస్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎవరైనా నెల, రెండు నెలల జీతాలు బోనస్ గా ఇస్తారు, కానీ ఈ సంస్థ ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని ఇచ్చి ఆశ్చర్యపరచింది.

 మూడు వేల మందికి పైగా బోనస్:

మూడు వేల మందికి పైగా బోనస్:

షిప్పింగ్ దిగ్గజం ఎవర్‌ గ్రీన్ మెరైన్ పేరు వినే ఉంటారు. గతంలో సూయిజ్ కాలువలో చిక్కుకుపోయిన పెద్ద నౌక ఈ కంపెనీదే. తన 3,100 మంది కార్మికులకు ఈ సంస్థ భారీ బోనస్‌ లను అందజేస్తున్నట్లు ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్‌సైట్ news.com.au నివేదించింది. ఐదేళ్లపాటు వచ్చే జీతాన్ని బోనస్ గా ఇస్తున్నట్లు పేర్కొంది.

వేతనాల పెరుగుదలా భారీగానే..

వేతనాల పెరుగుదలా భారీగానే..

ఎవర్ గ్రీన్ సిబ్బందికి ఈ ఏడాది వేతనాల పెరుగుదల సైతం అదే స్థాయిలో ఉండనున్నట్లు నివేదిక వెల్లడించింది. 2022లో కార్మికులు పొందిన 10-11 నెలల వేతనాలకు సమానమైన పే హైక్ ఇవ్వనున్నట్లు చెప్పింది. గతేడాది డిసెంబరులోనూ కంపెనీ బోనస్ ఇచ్చినట్లు తెలిపింది. కార్మికుల వ్యక్తిగత పనితీరును ఆధారంగా ఈ మొత్తం పంపిణీ చేయబడనున్నట్లు వివరిచింది.

వార్షిక వేతనాలు లక్షల్లోనే..

వార్షిక వేతనాలు లక్షల్లోనే..

జాబ్స్ వెబ్ సైట్ కంపేరబ్లీ ప్రకారం.. ఎవర్‌ గ్రీన్‌ లో వార్షిక వేతనాలు దాదాపు 37 లక్షల నుంచి 1 కోటి 42 లక్షల మధ్య ఉంటాయని తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ సంస్థ 16.25 బిలియన్ డాలర్లను ఆర్జించడంతో దాని లాభాలు సుమారు 40 శాతం పెరిగినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ పేర్కొంది. కొవిడ్-19 విజృంభణ సమయంలో, భౌగోళిక మరియు రాజకీయ ఉద్రిక్తతల వేళ.. వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే సంస్థ భారీ లాభాలకు కారణమని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+