ముంబై: శిల్పా మెడికేర్ షేర్ ధర నేడు ఏకంగా 13 శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.2.45 సమయానికి 11.77 శాతం లాభపడి రూ.509 వద్ద ఉంది. ఇందుకు ప్రధాన కారణంం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌తో శిల్పా మెడికేర్ మూడేళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి ఉధృతమవుతోన్న నేపథ్యంలో స్పుత్నిక్ వి వ్యాక్సీన్ తయారీకి ఈ ఒప్పందం కుదిరింది. డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం నేపథ్యంలో నేటి ప్రారంభ సెషన్లో శిల్పా మెడికేర్ స్టాక్స్ జంప్ చేశాయి. మూడేళ్ల పాటు ఒప్పందం ఉంటుందని కర్నాటక ధార్వాడ్‌కు చెందిన శిల్పా మెడికేర్ తన ప్రకటనలో తెలిపింది.

రెండింటి షేర్లు అదుర్స్
కరోనా అనంతరం ఫార్మా స్టాక్స్ దుమ్మురేపుతున్నాయి. ఏడాది కాలంలో ఈ స్టాక్ 40 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత మూడు నెలల్లో 11 శాతం ఎగిసింది. ఇప్పుడు స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ కోసం డాక్టర్ రెడ్డీస్‌తో జతకట్టిన శిల్పా మెడికేర్ స్టాక్ కూడా అదరగొడుతోంది. అందుకే నేడు ఉదయం 13 శాతం పెరిగింది. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ దాదాపు 12 శాతంతో ఉంది. శిల్పా-డాక్టర్ రెడ్డీస్ కలిసి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నాయి.

అక్కడే ఉత్పత్తి
శిల్ప మెడికేర్ స్టాక్ వారంలో పన్నెండు శాతం పెరిగింది. మూడు నెలల్లో 16 శాతం, సంవత్సర కాలంలో 37 శాతం ఎగిసింది. ప్రస్తుతం రూ.509 వద్ద ఉంది. శిల్పా మెడికేర్ తన సబ్సిడరీ కంపెనీ శిల్పా బయోలాజికల్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌లో భాగంగా స్పుత్నిక్ వి వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తారు. శిల్పా బయోలాజికల్ ప్రయివేట్ లిమిటెడ్‌కు కర్నాటకలోని ధార్వాడ్‌లో ఇంటెగ్రేటెడ్ బయోలాజికల్ ఆర్ అండ్ డీ కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంది. ఇక్కడి నుండి ఉత్పత్తి చేస్తారు.

5 కోట్ల డోసులు
డీల్‌లో భాగంగా ఉత్పత్తి ప్రారంభించి తొలి 12 నెలల్లో 5 కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులను తయారు చేయాల్సి ఉంది. తర్వాత మరో 5 కోట్ల డోసులు తయారు చేయాల్సి ఉంటుందని శిల్ప మెడికేర్ తెలిపింది. రష్యాలోని ఆర్డీఐఎఫ్ స్పుత్నిక్ వీ వ్యాక్సీన్‌ను తయారు చేసింది. ఇండియాలో దీని ఉత్పత్తి, పంపిణీ హక్కులను డాక్టర్ రెడ్డీస్ దక్కించుకుంది. ఇప్పటి వరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్పుత్నిక్ వీ డోసులు అందుబాటులోకి వచ్చాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications