ఆల్ టైమ్ గరిష్టానికి షిబా ఇను, పడిలేచిన బిట్ కాయిన్
క్రిప్టోకరెన్సీ అదరగొడుతోంది. షిబా ఇను అయితే ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. వివిధ క్రిప్టోల కరెన్సీ గత వారం రోజుల్లో 145 శాతం పెరిగింది. వరల్డ్ మోస్ట్ వ్యాల్యూడ్ క్రిప్టో బిట్ కాయిన్ నేడు మళ్లీ 60,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. నిన్న 58,000 వద్ద ట్రేడ్ అయినప్పటికీ, నేడు పుంజుకుంది. సాయంత్రం సెషన్‌లో 61,586 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇది భారత కరెన్సీలో రూ.46,05,284.50. బిట్ కాయిన్ అక్టోబర్ 20వ తేదీన 66,930 డాలర్లను ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. భారత కరెన్సీలో రూ.50 లక్షలకు పైన.
క్రిప్టో కరెన్సీ సెకండ్ దిగ్గజం ఎథేర్ నేడు 2.75 శాతం నష్టపోయింది. ఒక ఎథేర్ ఇప్పుడు 4,298 డాలర్లు(రూ.3.22 లక్షలు) వద్ద ట్రేడ్ అయింది. కార్డానో 7.48 శాతం నష్టపోయింది. టెథేర్, యూఎస్‌డీ కాయిన్, పోలిగాన్ లాభపడ్డాయి. ఇక షిబా ఇను గత ఇరవై నాలుగు గంటల్లో 43.22 శాతం లాభపడింది. ప్రస్తుతం ఇది 0.000075 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మన కరెన్సీలో రూ.0.0056.

ప్రస్తుతం బిట్ కాయిన్ 61వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.47 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయినప్పటికీ, ప్రస్తుతం 62వేల డాలర్లకు పైన ఉంది.


Click it and Unblock the Notifications