Shark Tank: ఉద్యోగులను మిలియనీర్స్‌గా మార్చిన యజమాని.. ఇది కదా సిబ్బంది కోరుకునేది
Viral Post: తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల పట్ల కొందరు యజమానులు ఉదారంగా వ్యవహరిస్తారు. బోనస్‌లు, గిఫ్ట్లు ఇచ్చి వాళ్లను సంతోష పడుతుంటారు. అయితే మరికొందరు యజమానులు మాత్రం తమతో పాటు ఉద్యోగులు కూడా ఎదగేలా మార్గాన్ని సెట్ చేస్తూ, వాళ్లని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలా తన సిబ్బందిలో ఎంతోమందిని లక్షాధికారులు చేసిన ఓ యజమాని గురించి తెలుసుకుందాం.
1999లో తన ఆడియో స్ట్రీమింగ్ సర్వీస్ ను 5.7 బిలియన్ డాలర్లకు యాహుకు విక్రయించినట్లు అమెరికన్ బిజినెస్ మ్యాన్ మరియు షార్క్ ట్యాంక్ జడ్జ్ మార్క్ క్యూబన్ గుర్తుచేశారు. తద్వారా తన 300 మంది ఉద్యోగులను లక్షాధికారులుగా మార్చినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో వివరాలను పంచుకున్నారు. తన కంపెనీలను విక్రయించే ముందు ఉద్యోగుల కోసం కొంత భాగాన్ని పక్కనపెట్టే అలవాటు తనకు ఉందని చెప్పారు.

తాను విక్రయించిన ప్రతి కంపెనీకి సంబంధించి అందులో ఏడాదికిపైగా పనిచేసిన ఉద్యోగులకు మంచి బోనస్‌లు ఇచ్చినట్లు తెలిపారు. బ్రాడ్ కాస్ట్ డాట్ కాం విక్రయ సమయంలోను మొత్తం 330 మంది సిబ్బంది 300 మందికి మిలియన్ల కొద్దీ పంచి ఇచ్చినట్లు వివరించారు. HD నెట్ డీల్ అంతపెద్దది కానప్పటికీ అందులోనూ 20 శాతం వెచ్చించినట్లు చెప్పారు. మావ్స్ నుంచి పూర్తిగా వైదొలగనప్పటికీ 35 మిలియన్ డాలర్లను ఉద్యోగులకు చెల్లించినట్లు వెల్లడించారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసొల్యూషన్స్ క్యూబన్ మొదటి కంపెనీ. 1990లో 6 మిలియన్ డాలర్లకు దానిని కంప్యూసర్వ్ అనే సంస్థకు విక్రయించారు. దానిలో 20 శాతాన్ని తన 80 మంది ఉద్యోగులకు 15 వేల డాలర్లు చొప్పున పంచి ఇచ్చారు. ఇదంతా సరదా కోసమే చేసినట్లు క్యూబన్ తెలిపారు. అంతా ఓ కలగా జరిగిపోయినట్లు చెప్పారు. కాగా 5.4 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోబ్స్ లిస్టులో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications