జీ(Zee) ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు మంగళవారం 15 శాతం వరకు పెరిగాయి. చివరికి 11 శాతం పెరిగి 150.90 వద్ద స్థిరపడింది.విలీనం రద్దుకు సంబంధించి సోనీతో అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీ తెలపడంతో స్టాక్ లో ర్యాలీ కనిపించింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో, జీ స్టాక్ రూ.154.9కి ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సెటిల్‌మెంట్‌లో భాగంగా, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌లో జరుగుతున్న ఆర్బిట్రేషన్‌లో పరస్పరం ఫిర్యాదులను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి.
ఈ సంవత్సరం జనవరిలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రతిపాదిత $10 బిలియన్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. Zee ఎంటర్‌టైన్‌మెంట్ విలీన ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా సోనీ $90 మిలియన్ల రద్దు రుసుమును కూడా కోరింది.ఆగష్టు 27న విడుదల చేసిన వారి ప్రకటనలో, సెటిల్‌మెంట్ నిబంధనల ప్రకారం, ఏ పక్షాలకూ మరొకరికి ఎటువంటి బకాయి లేదా కొనసాగుతున్న బాధ్యతలు లేదా బాధ్యతలు ఉండవని రెండు కంపెనీలు పేర్కొన్నాయి.

రెండు సంస్థల ప్రకటన ప్రకారం ఈ పరిష్కారం కంపెనీల మధ్య పరస్పర అవగాహనతో జరిగింది. జీ, సోనీల మధ్య మెగా-విలీనం ఈ సంవత్సరం జనవరి 22న రద్దు చేసుకున్నారు. విలీన సంస్థకు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో $10 బిలియన్ల డీల్ రద్దు అయింది. జీ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా గతంలో విలీనమైన కంపెనీకి నాయకత్వం వహించడానికి అభ్యర్థిగా అంగీకరించారు. అయితే గోయెంకా సెబీ విచారణ ఎదుర్కొవడంతో సోనీ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది.
సెప్టెంబరు 2021లో జీ డైరెక్టర్ల బోర్డు నుండి విలీన ఒప్పందానికి సూత్రప్రాయ ఆమోదం లభించింది. అయితే జీకి బ్యాంక్ అప్పులపై బ్యాంక్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆశ్రయించింది. ఆ తర్వాత విలీనానకి సంబంధించి పలు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సోనీ విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనిపై జీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications