శుక్రవారం ఎస్బీఐ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. దాదాపు 5 శాతం పడిపోయాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ కు సంబంధించి యుఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ విడుదల చేసిన నివేదిక తర్వాత అదానీ షేర్లుతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ షేర్లు భారీగా పడిపోయాయి. ఎస్బీఐ, ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టాయి. అలాగే ఎస్బీఐ అదానీ గ్రూప్ సంస్థలకు రుణాలు కూడా ఇచ్చనట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం ఎస్బీఐ స్టాక్ లో భారీ తగ్గుదల కనిపించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
మరో ప్రభుత్వ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ లో కూడా శుక్రవారం భారీ పతనం నమోదయింది. ఈ స్టాక్ దాదాపు 7 శాతం పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా కూడా అదానీ సంస్థలకు అప్పులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్టాక్ లో ఒత్తిడి కనిపించింది. ఇవే కాదు చాలా బ్యాంకు స్టాక్ ల్లో ఒత్తిడి కనిపంచింది. ముఖ్యంగా కోట్లది మంది భారతీయులు ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం పరిణామంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఈక్విటీ ఆస్తులలో 8 శాతం
ఎల్ఐసీ ఈక్విటీ ఆస్తులలో 8 శాతం అదానీకి చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. " ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన పని లేదని" అని SBI చైర్మన్ దినేష్ కుమార్ ఖరా రాయిటర్స్‌తో అన్నారు. అదానీ గ్రూప్ ఇటీవలి కాలంలో ఎస్‌బీఐ నుంచి ఎటువంటి నిధులను సేకరించలేదన్నారు. సమీప భవిష్యత్తులో వారి నుంచి అభ్యర్థన వస్తే అన్ని పరిశీలించాకే లోన్ ఇస్తామన్నారు. అదానీ గ్రూపునకు రుణాలు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నాయని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు.

పానిక్ మోడ్
"గత నెల వరకు, అదానీ గ్రూప్ రుణాలపై వడ్డీ చెల్లింపు చెక్కుచెదరకుండా ఉందని" ఓ అధికారి తెలిపారు. మరో ఇద్దరు ప్రైవేట్ రుణదాతల వద్ద బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు తాము ఇంకా "పానిక్ మోడ్‌లో" లేమని, అయితే నివేదిక ప్రకారం జాగ్రత్తగా ఉన్నామని చెప్పారు.మరోవైపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది.


Click it and Unblock the Notifications