ఒక్క రోజే 18 శాతం పెరిగిన స్టాక్.. కారణం అదేనా..!
బుధవారం ఓ స్టాక్ భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నూతన సాంకేతిక రంగంలోకి తమ అనుబంధ సంస్థల ద్వారా ప్రవేశించడానికి చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో రిలయన్స్ పవర్ షేరు ధర 18 శాతానికి పైగా పెరిగి ఇంట్రాడేలో గరిష్టంగా రూ.24.84కు చేరుకుంది. ఈ ర్యాలీతో, వరుసగా నాలుగు సెషన్లలో నష్టాలతో ఉన్న షేరుకు తెరపడింది. తొలుత 5 శాతం, తర్వాత 10 శాతం అప్పర్ సర్క్యూట్లు కొట్టి ఇంట్రాడేలో అంతకుమించి కూడా దూసుకెళ్లింది.
తమ వ్యాపార AI సాంకేతికత ఆధారిత కార్యకలాపాలను మొదలు పెడతామని కంపెనీ ఎక్సేంజ్ ఫైల్ లో తెలిపింది. దీంతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. రిలయన్స్ పవర్ తన అనుబంధ సంస్థల ద్వారా ఏఐ అధారిత డేటా సెంటర్లకు అవసరమైన స్వచ్ఛ ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే సబ్సిడరీల్లో 4 కంపెనీల షేర్లను కూడా మార్చింది. రిలయన్స్ ఏఐ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ డేటా కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ డేటా సి ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చింది.

రిలయన్స్ పవర్ మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.494 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.125.57 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,946.33 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది ₹2,065.64 కోట్లుగా ఉంది. రిలయన్స్ గ్రూప్ లో ముఖ్యమైన రిలయన్స్ పవర్ విదేశాలలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ స్టాక్ BSEలో జూలై 2025లో రూ.71 వద్ద తన 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. మార్చి 2026లో రూ.20.23 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అయితే ఈ స్టాక్ లో స్థిరత లేదు ఒకసారి పెరిగితే మరోసారి తగ్గుతుంది. అయితే స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు ఆ స్టాక్ ఫండమెంటల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రిలయన్స్ పవర్ స్టాక్ పై ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దు. పైగా కంపెనీ అప్పులు ఎక్కువగా ఉన్నాయని నిపుణలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.


Click it and Unblock the Notifications