Kalyan Jewellers: పెట్టుబడిదారులకు షాక్.. దాదాపు 8 శాతం పడిపోయిన స్టాక్..!
ఆభరణాలు విక్రయ కంపెనీ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి కంపెనీ మంచి వ్యాపార అప్టేట్ ఇచ్చినప్పటికీ మంగళవారం రోజు కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు దాదాపు 8 శాతం తగ్గాయి. కంపెనీ సానుకూల అప్డేట్స్ ఇచ్చినప్పటికీ ఇది ప్రత్యర్థి కంపెనీ టైటాన్ కంటే తక్కువ ఉండడంతో స్టాక్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మంగళవారం ఉదయం ఈ స్టాక్ సుమారు 7.7 శాతం వరకు పతనం అయింది. దీంతో స్టాక్ ప్రైస్ రూ. 351.55 చేరింది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు 2026లో దాదాపు 27 శాతం వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
జూన్ త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలలో మంచి వృద్ధిని సాధించింది. రెండంకెల గ్రోత్ ను నమోదు చేసినట్లు ప్రకటించినప్పిటికీ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ త్రైమాసికంలో ఇండియన్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంతో పోలీస్తే దాదాపు 38 శాతం వరకు ఆదాయ వృద్ధిని నమోదు అయింది. 28 శాతం సేమ్- స్టేర్ అమ్మకాల వృద్ధి కలిసొచ్చినట్లు కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రకటించింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగిన వేళ వరల్డ్ బిజినెస్ లో దాదాపు 35 శాతం ఆదాయాన్ని నమోదు చేసింది.

ఈ కంపెనీ పశ్చిమ ఆసియా ప్రాంతంలోనే సుమారుగా 30 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీకి వచ్చిన టోటల్ ఆదాయంలో ఇంటర్నెషనల్ మార్కెట్ల ద్వారా ఆదాయం దాదాపు 14 శాతం వరకు ఉంది. కంపెనీకి చెందిన డిజిటల్-ఫస్ట్ జ్యువెలరీ ప్లాట్‌ఫామ్ కాండర్ కూడా అమ్మకాలు కొనసాగాయి. దీని ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 112 శాతం పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసంలో కంపెనీ 12 కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షో రూములు ప్రారంభించింది. అలాగే ఐదు కాండర్ స్టార్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియాకు ఇప్పటి వరకు 524 షో రూములు ఉన్నాయి.
జూన్- ఏప్రిల్ త్రైమాసికంలో మంచి రోజులు ఉండడంతో పెళ్లిళ్లు భారీగా జరిగాయి. వివాహ సీజన్ నేపథ్యంలో కల్యాణ్ జ్యూవెలర్స్ షాపుల్లో భారీగా కొనుగోలు జరగడంతో కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. వచ్చే త్రైమాసికం గురించి కంపెనీ సానుకూల గైడెన్స్ ఇచ్చింది. అయితే అంచనాలకు అనుగుణంగా కంపెన అప్డేట్స్ లేవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కంపెనీ షేర్లు పతనం అయ్యాయని వివరిస్తున్నారు. మరో బంగారం ఆభరణాలు విక్రయించే టైటాన్ జ్యువెలర్స్ ఆదాయంలో 41 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో మంచి పనితీరును కనబర్చింది. వరల్డ్ బిజినెస్ గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 128 శాతం పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications