స్టాక్ మార్కెట్ ఓపెనింగ్స్ ఢమాల్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. పడిపోతున్న షేర్లు..

ఈ వారంలో చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్ గ్రీన్ లో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే బిఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ 30 స్టాక్స్ సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో 80072 వద్ద ప్రారంభం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ 50 షేర్ల ఇండెక్స్ నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 24196 వద్ద ప్రారంభమైంది.

మంచి ప్రారంభం తర్వాత షేర్ మార్కెట్ తడబడి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాల్లోకి చేరాయి. సెన్సెక్స్ 248 పాయింట్లు పతనమై 79695 వద్దకు చేరుకోగా నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 24135కి పడిపోయింది. పడిపోయిన షేర్లలో హీరో మోటోకార్ప్, సిప్లా, డాక్టర్ రెడ్డీ, ఐటీసీ, విప్రో ఉండగా ఈ ఐదు షేర్లు నిఫ్టీ టాప్ లూజర్ల లిస్టులో ఉన్నాయి.

Share Market Updates today Sensex has lost 466 points at 79477 Nifty loss 123 points at 24065

కేవలం ఒక రోజు తర్వాత ఉదయం 10: 30 నిమిషాల సమయంలో సెన్సెక్స్-నిఫ్టీ భారీ క్షీణత దిశగా పయనిస్తోంది. సెన్సెక్స్‌లో 466 పాయింట్లు నష్టపోయి 79477 స్థాయికి చేరుకుంది. కాగా నిఫ్టీ 123 పాయింట్ల నష్టంతో 24065కి దిగజారింది. ఫ్రంట్-రన్నింగ్ స్కామ్ ప్రభావం నేడు దేశీయ షేర్ మార్కెట్‌పై కనిపించవచ్చు. అలాగే మిశ్రమ ప్రపంచ సంకేతాల కారణంగా షేర్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం డీలా పడింది. ఎందుకంటే, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుండగా అమెరికా స్టాక్ మార్కెట్లు నిన్న గురువారం నష్టాలతో ముగిశాయి.

ఇక భారత స్టాక్ మార్కెట్ గురువారం బలమైన ర్యాలీని చూసింది, రెండు బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 2 శాతం జంప్ చేశాయి. సెన్సెక్స్ 1,436.30 పాయింట్లు (1.83 శాతం) లాభంతో 79,943.71 వద్ద, నిఫ్టీ 50 445.75 పాయింట్లు ( 1.88 శాతం) లాభంతో 24,188.65 వద్ద ముగిశాయి. మరోవైపు శుక్రవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ మార్కెట్లకు సెలవు కాగా, దక్షిణ కొరియా కోస్పీ ఇండెక్స్ 1.41 శాతం, కోస్‌డాక్ 1.33 శాతం పెరిగాయి. హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ప్రారంభ నష్టాల సూచిస్తున్నాయి.

బంగారం ధరలు: స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 2,660.25 డాలర్లకు చేరుకుంది, గురువారం రెండు వారాల కనిష్టానికి చేరుకోగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $2,673.90కి చేరుకుంది. క్రూడాయిల్ ధరల గురించి మాట్లాడుతూ, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.73 శాతం పెరిగి $75.93కి చేరుకుంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ గురువారం$73.20కి చేరుకుంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+