స్టాక్ మార్కెట్ సోమవారం (జనవరి 3, 2022) పరుగులు పెట్టింది. గత ఏడాది 62,000 మార్కు దాటి రికార్డు సృష్టించిన సెన్సెక్స్, ఒమిక్రాన్ కారణంగా ఏడాది చివరలో 58,000 పాయింట్ల స్థాయిలో ముగిసింది. అయితే ఈ ఏడాది ప్రారంభ సెషన్‌లోనే సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ ఓ సమయంలో ఏకంగా వెయ్యి పాయింట్లు లాభపడింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల వరకు ఎగిసింది. మధ్యాహ్నం గం.3.20 సమయానికి కాస్త తగ్గినప్పటికీ అతి స్వల్పమే. మార్కెట్ లాభాలకు వివిధ అంశాలు కారణం. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి.

అప్రమత్తం నుండి లాభాల దాకా
సోమవారం సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపడం లేదు. బడ్జెట్ ముందస్తు సమావేశాలు, మూడో త్రైమాసిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. అయితే దేశీయంగా ఒమిక్రాన్ సహా రోనా కేసులు భారీగా పెరగడం ఇన్వెస్టర్లను కొంత అప్రమత్తతకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఫ్లాట్‌గా కదిలినప్పటికీ, ఆ తర్వాత అంతకంతకూ పరుగులు తీశాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.38 వద్ద ఉంది.

రూ.3.15 లక్షల కోట్ల సంపద అప్
మోస్ట్ యాక్టివ్ జాబితాలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.15 లక్షల కోట్ల వరుక పెరిగింది.

ఫార్మా మినహాయ... అన్నీ జంప్
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫిన్ సర్వీసెస్, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు, నిఫ్టీ PSU బ్యాంకు 2 శాతం నుండి 2.72 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ 1 శాతం నుండి 2 శాతం మధ్య ఎగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ స్వల్పంగా 0.07 శాతం లాభపడింది. అయితే నిఫ్టీ ఫార్మా మాత్రం అర శాతం క్షీణించింది.
సెన్సెక్స్ ఉదయం 58,310.09 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,266.39 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,306.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,387.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,646.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,383.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 929.40 (1.60%) పాయింట్లు లాభపడి 59,183.22 పాయింట్ల వద్ద, నిఫ్టీ 271.65 (1.57%) పాయింట్లు ఎగిసి 17,625.70 పాయింట్ల వద్ద ముగిసింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications