ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 42,000 మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ 12,400కు సమీపంలో జీవితకాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.19 నిమిషాలకు సెన్సెక్స్ 44.79 (0.11%) పాయింట్లు ఎగిసి 41,827.94 వద్ద, నిఫ్టీ 20.90 (0.17%) ఎగిసి 12,322.40 వద్దకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.71 వద్ద ట్రేడ్ అయింది.
అమెరికా-చైనా మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ సూచీలు దూసుకెళ్లాయి. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంటును కూడా పెంచింది. దీంతో మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, నెస్లే, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వేదాంత, హిండాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. అంతకుముందు బుధవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

మధ్యాహ్నం పదకొండున్నర సమయానికి టాప్ గెయినర్స్‌లో ఐచర్ మోటార్స్, నెస్ట్లె, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, వేదాంత, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ ఉన్నాయి. మెటల్ రంగం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇన్ఫోసిస్, బ్యాంకు స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఫార్మా రంగం స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications