Ratan Tataని ఇంప్రెస్ చేయటానికి శంతను నాయుడు ఎంత ఖర్చు చేశాడంటే.. సూపర్ స్టోరీ

Shantanu Naidu: దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సన్నిహిత వర్గాలలో ఒకరైన శంతను నాయుడు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. శంతను నాయుడు ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూప్‌లో ఇంటర్న్‌గా చేరాడు. అయితే ఒకసారి టాటాకు రాసిన లేఖ వారిద్దరినీ కలిపింది. జంతువులను, ముఖ్యంగా వీధికుక్కలను రక్షించడానికి శంతను నాయుడు తీసుకొచ్చిన చొరవ వారిద్దరినీ దగ్గర చేసింది.

దీని తర్వాత రతన్ టాటా జనరల్ మేనేజర్‌గా శంతను నాయుడు నియమితులయ్యారు. నవయుగ యువకుడు శంతను నాయుడు, రతన్ టాటా మధ్య స్నేహం చాలా మందికి ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రతన్ టాటా చనిపోవటంతో ఏర్పడిన శూన్యాన్ని తన జీవితాంతం పూడ్చేందుకు ప్రయత్నిస్తానని శంతను నాయుడు చెప్పారు. శంతను నాయుడు రతన్ టాటాతో తన అనుభవాన్ని గురించి ఒక పుస్తకం కూడా రాశాడు. "ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్: ఎ షార్ట్ మెమోయిర్ ఆఫ్ లైఫ్ విత్ రతన్ టాటా" అనే పుస్తకంలో శంతను నాయుడు రతన్ టాటాను కలవడానికి డ్రెస్ కొనడానికి తన జీతంలో సగం ఎలా చెల్లించాడో ఆసక్తికరమైన కథనాన్ని వివరించాడు.

Shantanu Naidu wrote about bonding with Ratan Tata and brooks brothers shirt gift story

2021లో శంతను నాయుడు టాటా గ్రూప్‌లో క్యాజువల్ ఇంటర్న్‌గా ఎలా చేరారు. రతన్ టాటాకు సన్నిహిత మిత్రుడు ఎలా అయ్యాడో వివరంగా పోస్ట్ చేసారు. శంతను నాయుడు తొలిసారిగా రతన్ టాటాకు లేఖ రాశానని.. ఆ లేఖే ఇద్దరి మధ్య తొలి భేటీకి దారి తీసింది. ఆ తర్వాత వాళ్లిద్దరికీ జంతువులపై ఉన్న ప్రేమ స్నేహాన్ని మరింత పెంచింది. ఈ క్రమంలోనే శంతను నాయుడు ఉన్నత చదువుల కోసం ఇండియా వదిలి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వెళ్లే ముందు రతన్ టాటాను కలవాలని అభ్యర్థించారు. దీనికి అనుమతించిన టాటా డిన్నర్ పార్టీకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే టాటాకు ఇష్టమైన బ్రాండ్ బ్రూక్ బ్రదర్స్ షర్ట్ కొని డిన్నర్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చొక్కా కొనుక్కోవటానికి ఏకంగా తన నెల జీతంలో సగం వెచ్చించినట్లు నాయుడు వెల్లడించాడు.

దీని తర్వాత శంతను నాయుడు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గ్రాడ్యుయేషన్ మీటింగ్ కి రతన్ టాటాను రావలసిందిగా కోరాడు. తాను అమెరికాలో ఉన్న సమయంలో కొన్నిసార్లు రతన్ టాటాను కలిసేవాడినని వెల్లడించారు. రతన్ టాటా అదే షర్ట్‌ను USలోని ఒక దుకాణంలో కొత్తది కొనాలని పట్టుబట్టాడు. శంతను నాయుడు బిల్లింగ్ కౌంటర్ వద్ద వాదించడానికి ప్రయత్నించినప్పుడు.. టాటా "నా స్నేహితుడికి చొక్కా ఇవ్వకూడదా?" అని అన్నారు. అలా టాటా శంతను నాయుడుకు చొక్కా గిఫ్ట్ ఇచ్చిన రోజు నుంచి తమ స్నేహం మరింత బలపడిందని శంతను నాయుడు తన పుస్తకంలో పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+