బ్యాంక్ FD లేదా నిఫ్టీ 50.. గత 12 ఏళ్ల రిటర్న్స్ పై శంకర్ శర్మ క్రేజీ విశ్లేషణ.. ఏది బెస్ట్ అంటే?

భారతీయ స్టాక్ మార్కెట్ (stock market) లో ఇన్వెస్ట్ చేస్తేనే దీర్ఘకాలంలో భారీగా సంపద సృష్టించవచ్చని, సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Bank FDs) తక్కువ లాభాలు ఇస్తాయని అందరూ చెబుతుంటారు. అయితే, ఈ రెండింటి మధ్య దశాబ్దాలుగా సాగుతున్న చర్చకు ప్రముఖ ఇన్వెస్టర్, జిక్వాంట్ ఇన్వెస్ట్‌టెక్ (GQuant Investech) వ్యవస్థాపకుడు శంకర్ శర్మ సరికొత్త డేటాతో మళ్లీ తెరలేపారు.

ఒక ప్రశాంతమైన శనివారం ఉదయం కాఫీ తాగుతూ.. గత 12 ఏళ్ల కాలానికి (మే 15, 2014 నుండి మే 15, 2026 వరకు) నిఫ్టీ 50 ఇండెక్స్ , బ్యాంక్ ఎఫ్‌డీల పనితీరును టాక్స్ (పన్నులు) , రిస్క్ ఆధారంగా విశ్లేషించి 'X' (ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన తెచ్చిన ఈ సరికొత్త లెక్కలు ఇప్పుడు ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Shankar Sharma Nifty 50 vs Bank FD Returns Comparison Stock Market Fixed Deposit CAGR

శంకర్ శర్మ తేల్చిన 12 ఏళ్ల రిటర్న్స్ లెక్కలు ఇవే!

ఈ విశ్లేషణలో శంకర్ శర్మ తానుగా ఎలాంటి ముగింపును ప్రకటించకుండా.. "డేటా మీ ముందే ఉంది, ప్రజలు (అవామ్) ఏమనుకుంటున్నారో వారికే వదిలేస్తున్నా" అంటూ ఈ క్రింది గణాంకాలను పంచుకున్నారు..

  • నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (Nifty 50 TRI): గత 12 ఏళ్లలో నిఫ్టీ 50 ట్యాక్స్ కట్ అయిన తర్వాత సగటున 9.38% వార్షిక వృద్ధి రేటు (Post-tax CAGR) ను నమోదు చేసింది.
  • డాలర్ రూపంలో నిఫ్టీ (Nifty in USD): గ్లోబల్ ఇన్వెస్టర్ల కోణంలో డాలర్ విలువతో పోల్చి చూస్తే.. రూపాయి విలువ పతనం (Rupee depreciation) కారణంగా నిఫ్టీ కేవలం 5.11% పోస్ట్-టాక్స్ సీఏజీఆర్ మాత్రమే ఇచ్చింది.
  • బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Bank FD): ఇదే 12 ఏళ్ల కాలంలో బ్యాంక్ ఎఫ్‌డీలు పన్నులు మినహాయించిన తర్వాత కేవలం 4.93% వార్షిక వృద్ధిని మాత్రమే అందించాయి.

రిస్క్-అడ్జస్టెడ్ రిటర్న్స్ లో ఎఫ్‌డీలదే పైచేయి!

కేవలం రిటర్న్స్ పర్సంటేజ్ చూస్తే నిఫ్టీనే బెస్ట్ అనిపిస్తుంది. కానీ, మార్కెట్లలో బుల్ రన్ (భారీ లాభాలు) నడుస్తున్నప్పుడు చాలామంది మర్చిపోయే 'రిస్క్ , వోలటాలిటీ' (మార్కెట్ హెచ్చుతగ్గులు) అంశాలను శంకర్ శర్మ హైలైట్ చేశారు. ఈక్విటీ మార్కెట్లలో వార్షిక వోలటాలిటీ సగటున 15 శాతంగా ఉంటుంది. ఈ రిస్క్‌ను అడ్జస్ట్ చేసి చూసినప్పుడు అసలు ట్విస్ట్ బయటపడింది.

  • రిస్క్ , టాక్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత నిఫ్టీ టిఆర్ ఇండెక్స్ యొక్క రిటర్న్ రేషియో కేవలం 0.617 గా ఉంది. అలాగే డాలర్ లెక్కింపుతో కూడిన నిఫ్టీ రేషియో ఇంకా పడిపోయి 0.336 వద్ద నిలిచింది.
  • మరోవైపు, బ్యాంక్ ఎఫ్‌డీలలో వోలటాలిటీ (రిస్క్) కేవలం 0.25 శాతం మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఎఫ్‌డీల యొక్క టాక్స్ , రిస్క్-అడ్జస్టెడ్ రిటర్న్ రేషియో ఏకంగా 19.720 కి చేరింది. పైగా ఇందులో పెట్టిన పెట్టుబడికి (Return of capital) వంద శాతం గ్యారెంటీ ఉంటుంది.

ఈ డేటా ఇన్వెస్టర్లకు ఎందుకు ముఖ్యం?

ప్రస్తుతం అంతర్జాతీయంగా నడుస్తున్న భౌగోళిక ఉద్రిక్తతలు (Geopolitical tensions), ద్రవ్యోల్బణ భయాల వల్ల స్టాక్ మార్కెట్ (stock market) తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కొన్ని రంగాలలో కంపెనీల ఆదాయ వృద్ధి కూడా మందగించింది. ఇటువంటి తరుణంలో ఈ డేటా ప్రాధాన్యత సంతరించుకుంది. గత రెండేళ్లుగా బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను భారీగా పెంచడం కూడా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లకు (రిస్క్ వద్దు అనుకునే వారికి) కలిసి వస్తోంది.

మార్కెట్ కరెక్షన్లు, రూపాయి విలువ తగ్గడం వంటి అంశాలు మనం అనుకునే లాభాలను ఎలా దెబ్బతీస్తాయో శంకర్ శర్మ డాలర్ ఆధారిత నిఫ్టీ లెక్కల ద్వారా నిరూపించారు. కేవలం వచ్చే లాభాలను మాత్రమే కాకుండా.. ఆ లాభాల కోసం మనం ఎంత రిస్క్ ఎదుర్కొంటున్నాం అనే 'రిస్క్-అడ్జస్టెడ్' కోణాన్ని కూడా ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలని ఈ డేటా స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+