Trending Stock: రెండు రోజుల్లో 40 శాతం పెరిగిన స్టాక్.. మీ పోర్ట్‌ఫోలియోలో స్టాక్ ఉందా..??
Shakti Pumps Stock: మార్కెట్లు కొంత గందరగోళానికి గురవుతున్నప్పటికీ.. కొన్ని షేర్లు మాత్రం చాలా క్లారిటీగా పైపైకి పెరుగుతున్నాయి. అలా ట్రెండింగ్ లో ఉన్న స్టాక్ కేవలం రెండు రోజుల్లో 40 శాతం రాబడిని అందించి ఇన్వెస్టర్లను అవాక్కయ్యేలా చేస్తోంది.
ప్రస్తుతం మార్కెట్ లిస్టెడ్ కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగా శక్తి పంప్స్ కంపెనీ తన క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఏకంగా 19.76 శాతం వృద్ధి చెంది రూ.1,524కి చేరుకుని సరికొత్త 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీనికి ముందు సోమవారం సైతం కంపెనీ షేర్లు 20 శాతం మేర పెరిగి వరుసగా రెండు రోజుల్లో 40 శాతం రాబడిని అందించాయి.

అలాగే గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 100 శాతానికి పైగా రాబడిని అందించాయి. ఏడాది కాలంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు ఏకంగా 244 శాతం రాబడిని అందించింది. అలాగే సోమవారం కంపెనీకి సంబంధించిన ఒక శుభవార్త కూడా వచ్చింది. మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 46 ఎకరాల భూమిని పొందినట్లు కంపెనీ జనవరి 29న తెలియజేసింది. కంపెనీ ఈ భూమిని A-10, B-86 స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్, సెక్టార్-7, పితంపూర్ ఇండోర్‌లో పొందింది. ఈ భూమిని భవిష్యత్తులో విస్తరణకు వినియోగించనున్నట్లు కంపెనీ యోచిస్తోంది.
శక్తి పంప్స్ జనవరి 27న త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.495.60 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 57 శాతం అధికం. పన్ను చెల్లింపుల తర్వాత కంపెనీ నికర లాభం రూ.45.2 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర 15.57 శాతం లాభంతో రూ.1,469 వద్ద ఎన్ఎస్ఈలో తన ప్రయాణాన్ని ముగించింది.


Click it and Unblock the Notifications