Shakti Pumps: దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగినా లేదా తగ్గినా వాటితో సంబంధం లేకుండా నిరంతరం కొన్ని షేర్లు మాత్రం అప్పర్ సర్క్యూట్ తాకుతూ పోతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న మల్టీబ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్ల సంపదను ప్రతిరోజూ పెంచుతూ అద్భుతమైన రాబడిని అందిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది శక్తి పంప్స్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి లాక్ డౌన్ ముందు స్టాక్ ధర కేవలం రూ.100 వద్ద ఉండేది. అయితే ప్రస్తుతం కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.3300కి చేరుకుంది. ప్రస్తుతం గడచిన కొన్ని రోజులుగా కంపెనీ షేర్లు నిరంతరం అప్పర్ సర్క్యూట్ తాకుతోంది. శుక్రవారం సైతం కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.3302 వద్ద ట్రేడింగ్ ముంగించింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు ఏకంగా 450 శాతం రాబడిని అందించింది.

1982లో స్థాపించబడిన శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్ కంపెనీ భారతదేశపు మొదటి BEE 5 స్టార్ రేటెడ్ పంప్ తయారీదారుగా గుర్తింపు దక్కించుకుంది. ఇది ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ. కంపెనీ ప్రపంచంలో 100 శాతం స్టెయిన్‌లెస్ స్టీల్ పంప్స్, ఎనర్జీ మోటార్‌లను తయారు చేస్తోంది. నాలుగు రోజుల కిందట కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.2584 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే అప్పటి నుంచి వరుసగా షేర్లు అప్పర్ సర్క్యూట్లో తాకటం వల్ల ప్రస్తుతం మార్కెట్లో రూ.3302కి చేరుకుంది. గడచిన వారంలో కంపెనీ షేర్ల ధర ఏకంగా 27 శాతం వృద్ధి చెంది దాదాపు రూ.700 షేరుకు పెరిగింది.
గడచిన ఐదేళ్లుగా కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే.. జూన్ 21, 2019లో కంపెనీ షేర్ల ధర రూ.392 వద్ద నుంచి పెరిగి ప్రస్తుతం రూ.3302కి పెరిగింది. ఈకాలంలో ఇన్వెస్టర్లకు దాదాపు 719 శాతం రాబడిని అందించింది. అలాగే గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 449 శాతం పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు మార్చి 20, 2020న ఈ స్టాక్ ధర రూ.113.40 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఇన్వెస్టర్ తన డబ్బును కంపెనీ షేర్లలో కరోనాకి ముందు ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వారు 29 రెట్లు రాబడిని అందుకునేవారు. ఈ కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 2800 శాతం మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అంటే అప్పట్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ రూ.29 లక్షలకు చేరుకుని ఉండేది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications