భారతదేశంలో బంగారం ధరలు ఈ ఆర్థిక సంవత్సరంలో 35 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (SGBs)పై చెల్లించాల్సిన అప్పు కూడా రికార్డు స్థాయిలో పెరిగి రూ. 1.5 లక్షల కోట్లు దాటింది. ఇది ఇప్పటివరకు గోల్డ్ బాండ్ల కింద నమోదైన అత్యధిక బకాయిగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికి మొత్తం SGB బకాయి 126 టన్నులు కాగా బంగారం టన్ను ధర రూ. 1,241 కోట్లు గా ఉంది. గత 58 విడతల్లో (ఇంకా పరిపక్వత రాని బాండ్లు) సగటు ఇష్యూ ధర గ్రాముకు రూ. 4,227గా నమోదైంది. ప్రభుత్వం ఈ బాండ్లపై ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అది విడుదల సమయంలో ఉన్న బంగారం ధరలపై లెక్కించబడుతుంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో, ప్రభుత్వ చెల్లించాల్సిన బకాయిలు కూడా సుమారు 200 శాతం పెరిగినట్లు అంచనా.

కోటక్ మహీంద్రా బ్యాంక్ అధ్యక్షుడు శేఖర్ భండారి ఈ అంశంపై మాట్లాడుతూ.. 2017-18లో SGB బాధ్యతలు కేవలం రూ. 6,664 కోట్లు ఉండగా, ఇప్పుడు అవి 930 శాతం పెరిగి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. బంగారం ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం ఇదేనని తెలిపారు. బంగారం ధరలు రెట్టింపైనప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించిన తాజా డేటా ప్రకారం.. ఈ బాండ్లను ముందస్తుగా రిడీమ్ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వం SGBల కొత్త విడుదలలను నిలిపివేసింది. చివరి విడత ఫిబ్రవరి 2024లో గ్రాముకు రూ. 6,263 వద్ద జారీ చేయబడగా, ఇప్పుడు బంగారం ధరలు రూ. 12 వేలకు పైగా ఉన్నాయన్నారు.
SGBలు ప్రభుత్వానికి ఒకవైపు బాధ్యతగా కనిపించినా.. మరోవైపు విలువైన ఆస్తి కూడా అవుతాయన్నారు. ఈ పథకం కారణంగా 150 టన్నుల బంగారం దిగుమతులు తగ్గాయి. ఇది దేశ విదేశీ మారక నిల్వలపై రూపాయి స్థిరత్వంపై సానుకూల ప్రభావం చూపిందన్నారు. నిపుణులు కూడా SGB పథకం వల్ల భారతదేశం బంగారం దిగుమతులను గణనీయంగా తగ్గించగలిగిందని, దీని వలన చెల్లింపుల సమతుల్యతపై ఒత్తిడి తగ్గిందని పేర్కొన్నారు. అయితే RBI ఈ బాండ్లకు సమానంగా విదేశీ మారక నిల్వల్లో బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఒక పరోక్ష హెడ్జింగ్ నిర్వహిస్తోంది.
SGBలు వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFలు), ట్రస్టులు, విశ్వవిద్యాలయాల కోసం భద్రమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా పరిగణించబడుతున్నాయి. ఇవి వడ్డీ రూపంలో ఆదాయం ఇవ్వడమే కాకుండా, ధరల పెరుగుదల ద్వారా ద్వంద్వ లాభం అందిస్తాయి.ఇదే సమయంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు).. పేపర్ గోల్డ్ రూపంలో ఉన్న పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే.. భారతదేశంలో గోల్డ్ ETFల మొత్తం బకాయిలు 77.3 టన్నులకు, విలువ 10 బిలియన్ డాలర్లకు చేరాయి. క్వాంటం AMC CIO చిరాగ్ మెహతా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం బంగారం, వెండి అన్ని ఇతర లోహాలను అధిగమించి అత్యుత్తమ ఆస్తి తరగతిగా మారాయి. పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను 5 శాతం నుంచి 15 శాతం వరకు పెంచుతున్నారు. ఇది డైవర్సిఫికేషన్‌కి, అలాగే దీర్ఘకాల పెట్టుబడి భద్రతకు దోహదపడుతుందని చెబుతున్నారు.
ఏదేమైనా బంగారం ధరల పెరుగుదలతో ప్రభుత్వం SGBల రూపంలో గణనీయమైన బాధ్యతను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఈ పథకం దేశ ఆర్థిక వ్యవస్థకు వినియోగదారుల ఆదాయం, రూపాయి స్థిరత్వం, దిగుమతి నియంత్రణలో సానుకూల ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications