Sovereign Gold Bonds: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ భారీగా ప్రజాధరణను పొందిన సంగతి తెలిసిందే. చాలా మంది డిజిటల్ గా బంగారంలో పెట్టుబడులను పెట్టి ప్రస్తుతం మంచి రాబడులను చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ గురించి భారీగా చర్చ కొనసాగుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ VIII గురించే. వాస్తవానికి దీనిని ప్రజలకు 2017-18 మధ్యకాలంలో విక్రయించబడినప్పటికీ నవంబర్ 19, 2024తో ప్రీమెచ్యూర్ అయ్యాయి. అయితే 5 ఏళ్లు పూర్తి చేసుకోవటంతో ప్రస్తుతం వీటిని ప్రజలు వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. దీనికోసం రిజర్వు బ్యాంక్ రిడెంప్షన్ ధరను యూనిట్‌కు రూ.7460గా నిర్ణయించబడింది. వాస్తవానికి ఈ రేటు నవంబర్ 13 నుంచి 15 వరుకు రిటైల్ మార్కెట్లో ఉన్న విక్రయ ధరకు సగటు కావటం గమనార్హం. వాస్తవానికి 2017లో సిరీస్ విక్రయానికి ఉంచినప్పుడు గ్రాము గోల్డ్ ధర కేవలం రూ.2961 వద్ద ఉండగా ప్రస్తుతం అందిస్తున్న ధరతో పోల్చినప్పుడు పెట్టుబడిదారులు ఏకంగా 152 శాతం భారీ రాబడిని పొందుతున్నారు.

అయితే ఈ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ తేదీ నవంబర్ 20, 2025గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లాకిన్ పిరియడ్ పూర్తి కాగానే పెట్టుబడిదారులు తమ అవసరాల కోసం ముందుగానే తీసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ఇది బాండ్ వడ్డీ చెల్లింపు తేదీలతో సమానంగా ఉండాలి. నవంబర్ 20, 2017న జారీ చేయబడిన సిరీస్ VIII కోసం.. ఐదేళ్లు పూర్తయిన తర్వాత నవంబర్ 2022లో ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు మొదటి అవకాశం లభించింది. నవంబర్ 19, 2024న తాజా రిడెంప్షన్ తేదీ, అర్హత ఉన్న పెట్టుబడిదారులకు మరో అవకాశాన్ని అందిస్తుంది. రిడెంప్షన్ తేదీకి ముందు వారంలో 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఫైనల్ రిడెంప్షన్ ధర నిర్ణయించబడుతుంది. ఈ సగటు ముగింపు ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అందిస్తుందని గుర్తుంచుకోవాలి.
వాస్తవానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 2015లో ప్రారంభించబడిన SGBలు భారత ప్రభుత్వంతో సంప్రదించి RBI ద్వారా కాలానుగుణంగా జారీ చేయబడతాయి. సాధారణంగా ఎనిమిదేళ్ల కాలవ్యవధిని కలిగి ఉంటాయి. వడ్డీ చెల్లింపు తేదీలలో ఐదవ సంవత్సరం తర్వాత నిష్క్రమించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం వీటికి 2.5 శాతం వడ్డీని కేంద్రం ఆఫర్ చేస్తోంది. స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, HUFలు కనిష్టంగా 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోగ్రాముల వరకు బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇక ట్రస్టులకు ఈ పరిమితి 20 కిలోలుగా నిర్ణయించబడింది.
డీమ్యాట్ ఖాతాలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా బ్యాంకులు, నియమించబడిన పోస్టాఫీసుల వంటి అధీకృత ఆర్థిక సంస్థల ద్వారా ఆఫ్‌లైన్ కొనుగోలుకు అవకాశం కల్పించబడింది. ఆఫ్‌లైన్ పెట్టుబడిని బ్యాంకులు, పోస్టాఫీసులలో చేయవచ్చు. ఇక్కడ పెట్టుబడిదారులు భౌతిక దరఖాస్తు ఫారమ్‌లను మరియు నగదు, చెక్కులు లేదా డిమాండ్ డ్రాఫ్ట్‌ల వంటి చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా బంగారం మార్కెట్ ధర తగ్గితే మూలధన నష్టం సంభవించే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications