SG Mart: ఐదేళ్లలో 5,822 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
ఎస్జీ మార్ట్ షేరు ప్రైస్ దూసుకెళ్తోంది. బుధవారం ఎస్జీ మార్ట్ షేర్ 20 శాతం లోయర్ సర్క్యూట్ తాకినప్పటికీ గురువారం తిరిగి కోలుకుంది. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ లో 4 శాతం వరకు లాభపడింది. ఎన్ఎస్ఈ (NSE)లో ఎస్జీ మార్ట్ షేర్లు రూ.749 వద్ద ప్రారంభమయ్యాయి. నవంబర్ 26న ఈ షేరు ఇంట్రాడేలో గరిష్టంగా రూ.865 స్థాయిని తాకాయి. గురువారం ఈ షేరు ధర పెరగడానికి ఎటువంటి నిర్దిష్ట ప్రాథమిక కారణం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఈ రోజు ట్రేడింగ్‌లో దాదాపు 93.56 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ డైరెక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల గురువారం (నవంబర్ 26) జరగాల్సిన బోర్డు సమావేశాన్ని రద్దు చేసినట్లు ఎస్జీ మార్ట్ పేర్కొంది.
ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గతంలో (నవంబర్ 22న) కంపెనీ ఫైలింగ్ లో పేర్కొంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (QIP) లేదా ఇతర చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా నిధులను సేకరించే అంశాన్ని ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎస్జీ మార్ట్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం తగ్గి రూ.156 కోట్లకు చేరుకుంది. అయితే జూన్ త్రైమాసికంతో పోలిస్తే 19% వృద్ధిని నమోదు చేసింది.

నికర లాభం గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి రూ.54 కోట్లకు చేరుకోగా, గత త్రైమాసికంతో పోలిస్తే 19% వృద్ధిని సాధించింది. కంపెనీ తన నిర్వహణ పనితీరులోనూ గణనీయమైన మెరుగుదల కనబరిచింది. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ప్రకారం, ఈబీఐటీడీఏ (EBITDA) గత ఏడాదితో పోలిస్తే 157 శాతం పెరిగి రూ.72 కోట్లకు చేరుకుంది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 23 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఎబిట్డా మార్జిన్ గత ఏడాదితో పోలిస్తే 297 బేసిస్ పాయింట్లు, గత త్రైమాసికంతో పోలిస్తే 12 బేసిస్ పాయింట్లు పెరిగి 4.6 శాతానికి పెరిగింది. ఎస్జీ మార్ట్ సంస్థ B2B మెటల్ ట్రేడింగ్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇది స్టీల్ సర్వీస్ సెంటర్లు, డౌన్‌స్ట్రీమ్ పంపిణీ వ్యవస్థల ద్వారా తన సేవలను అందిస్తోంది. ఈపీసీ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు), డీలర్లు, రిటైలర్లు వంటి విభిన్న కస్టమర్లకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. దీర్ఘకాలంలో ఎస్జీ మార్ట్ షేర్లు భారీ వృద్ధిని నమోదు చేశాయి. గత ఐదేళ్లలో ఇవి 5,822.92 శాతం రాబడిని (మల్టీబ్యాగర్ రిటర్న్స్) అందించాయి. గత 10 ఏళ్లలో ఈ స్టాక్ 43,099 శాతం పెరగ్గా.. గత ఏడాది కాలంలో 145.84% వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ప్రారంభం నుండి (YTD) చూస్తే ఈ స్టాక్ 126.39 శాతం పెరిగి పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించింది. ఈ స్టాక్ గత వారంలో 13.94 శాతం, గత రెండు వారాల్లో 4.70 శాతం మేర తగ్గుదల కనిపించింది. ఈ స్వల్పకాలిక బలహీనత ఉన్నప్పటికీ గత నెలలో ఎస్జీ మార్ట్ షేర్లు 8.56 శాతం పెరిగాయి. గత మూడు నెలల్లో 3.36% వృద్ధిని నమోదు చేశాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications