New Swan Multitech IPO: కొత్త ఏడాది వస్తున్న అనేక ఐపీవోలు పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం రాబోతున్న ఒక ఐపీవోపై చాలా మంది ఇన్వెస్టర్లు బెట్టింగ్ చేసేందుకు సిద్ధమౌతున్నారు.
ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన కంపెనీ న్యూ స్వాన్ మల్టీటెక్ ఐపీవోపై సంపాదించేందుకు అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.62-66గా ప్రకటించింది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం జనవరి 11న ప్రారంభమై జనవరి 15న ముగియనుంది. ఇందులో లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఒక లాట్ కొనాలంటే కనీస పెట్టుబడిగా రూ.1.32 లక్షలు అవసరం.

ఐపీవోలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు జనవరి 16న కేటాయింపులు జరగొచ్చని తెలుస్తోంది. అలాగే షేర్లు రానివారికి రీఫండ్ జనవరి 17న లభించనుంది. అలాగే న్యూ స్వాన్ మల్టీటెక్ షేర్లు జనవరి 18న BSE SMEలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం రూ.33.11 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 5,016,000 తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. కన్వర్‌దీప్ సింగ్, ఉపకార్ సింగ్, బరున్‌ప్రీత్ సింగ్ అహుజా కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు.
1985లో స్థాపించబడిన ఆటోమోటివ్ ఉత్పత్తులను తయారీదారుగా ఉన్న కంపెనీ.. ఇంజిన్ హ్యాంగర్, హింజ్ బాడీ కవర్, ఫ్యూయల్ ఫిల్లర్, ఇంజిన్ గార్డ్ ప్లేట్, రియర్ బ్రేక్ ఆర్మ్ అసెంబ్లీ, సెపరేటర్ బ్రీదర్స్, కేబుల్ గైడ్ అసెంబ్లీ ఉన్నాయి. న్యూ స్వాన్ మల్టీటెక్ క్లయింట్‌ల జాబితాను పరిశీలిస్తే.. టాటా మోటార్స్, హీరో మోటార్స్, మారుతీ సుజుకీ, సుజుకి, హోండా, మహీంద్రా టూవీర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications