Gold: 1000 టన్నుల బంగారం కొన్న చైనా.. ఇక పసిడి ధరలు పైకే..!
గత సంవత్సరం కాలంగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులు, అలాగే సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేయడం. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు వెళ్తున్నారు. ఇందులో భాగంగా పుత్తడిలో పెట్టుబడి పెడుతున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేసింది. చైనా ఈ ఏడాది దాదాపు 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
2025 జనవరిలో ఔన్సు బంగారం ధర రూ.2,625 ఉండేది. కానీ 2026 జనవరి వచ్చే సారికి ఔన్సు పసిడి ధర 5,595 డాలర్లకు పెరిగింది. చైనా బంగారాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఉత్పత్తి కూడా చేస్తోంది. వరల్డ్ గోల్డ కౌన్సిల్ ప్రకారం చైనా గత ఏడాది 284 టన్నుల పుత్తడిని ఉత్పత్తి చేసింది. అయినప్పటికీ డ్రాగన్ దేశం బంగారం కొనుగోలు ఆపలేదు. అక్కడి పెట్టుబడిదారులు కూడా పసిడిపై పెట్టుబడి పెట్టారు. పసిడిని భారీగా కొనుగోలు చేయడం వల్ల జూలైలో చైనాలో ఉన్న విదేశీ నిల్వలు 618 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2008 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యల్పం. చైనాలో 2021లో రియల్ ఎస్టేట్ పతనం అయింది. దీంతో అక్కడి పెట్టుబడిదారులు క్రమంగా బంగారం వైపు మళ్లీనట్లు నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరలు పెరుగుదల అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలుపై ఆధారపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం చేస్తే పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే సెంట్రల్ బ్యాంకులు పసిడి కొనుగోలు తగ్గిస్తే కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరికి పసిడి ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. గతంలో 4,900 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేయగా.. దాన్ని 4,650 డాలర్లకు తగ్గించింది. అమెరికా ద్రవ్య విధానం బంగారంపై కొంత ఒత్తిడి చూపుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.
సెప్టెంబర్ 16న ఫెడ్ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75-4 శాతానికి పెంచింది. 2023 తర్వాత అమెరికా కేంద్ర బ్యాంక్ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు, పెరిగే బాండ్ ఈల్డ్స్, బలపడే డాలర్ వంటి అంశాలు తక్కువ కాలంలో బంగారంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అధిక వడ్డీ రేట్ల ప్రభావాన్ని కేంద్ర బ్యాంకుల బలమైన బంగారం కొనుగోళ్లు కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నెలకు దాదాపు 91 టన్నుల స్థాయిలో ఉన్నాయని తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
