Smart Phones: భారీగా పడిపోయిన స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు.. కారణం ఇదే..!
స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం నుంచి ఈ ఫోన్ల ధరలు రెండు, మూడు నెలలకు ఒకసారి పెరుగుతున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయడం తగ్గించారు. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు వార్షిక ప్రాతిపదికన 26 శాతం తగ్గి 3.58 కోట్ల యూనిట్లకు తగ్గాయి. 2016 తర్వాత మూడో త్రైమాసికంలో ఇదే అత్యల్ప స్థాయి అని మార్కెట్ పరిశోధనా సంస్థ ఓమ్డియా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఫోన్ల ధరలు పెరగడం, వినియోగదారులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం, పాత ఫోన్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే డిమాండ్ (రీప్లేస్‌మెంట్) తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక వివరించింది.
ఆన్‌లైన్ విక్రయాలు బలహీనపడటం, ఈ ఏడాది దీపావళి ఆలస్యం కావడం వల్ల సెప్టెంబర్ లో జరగాల్సిన ఆఫ్‌లైన్ పండుగ స్టాకింగ్ అక్టోబర్‌కు వాయిదా పడటం త్రైమాసిక వాల్యూమ్‌ల పతనానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు తగ్గినప్పటికీ.. శామ్‌సంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శామ్‌సంగ్ 67 లక్షల యూనిట్ల షిప్‌మెంట్లతో 19 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే షిప్‌మెంట్స్ దాదాపు 1 శాతం తగ్గినా, 2024 తొలి త్రైమాసికం తర్వాత తొలిసారి మొదటి స్థానం కైవసం చేసుకోవాలి. గెలాక్సీ ఏ07, ఏ17, ఏ27 మోడళ్లతో పాటు గెలాక్సీ ఎస్26 సిరీస్, కొత్త ఫోల్డబుల్ ఫోన్లు శాంసంగ్‌కు కలిసొచ్చాయని వివరించింది.

బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్సేచంజ్ ఆఫర్లు, దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ సదుపాయాలు షిప్‌మెంట్ వృద్ధికి తోడ్పడ్డాయి. చైనా బ్రాండ్లలో వివో షిప్‌మెంట్‌లు అత్యధికంగా 34 శాతం పడిపోయి 64 లక్షలకు (6.4 మిలియన్లు) చేరాయి. ఒప్పో (49 లక్షలు), షావోమీ (47 లక్షలు) యూనిట్లు విక్రయించాయి. ధరల పెరుగుదల అంచనాల నేపథ్యంలో ఛానెల్ స్టాకింగ్ జరగడం ఐఫోన్ 17, 16 మోడళ్లకు స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. యాపిల్ 39 లక్షల (3.9 మిలియన్లు) షిప్‌మెంట్స్‌తో టాప్-5 జాబితాలో కొనసాగుతోది. త్రైమాసికం చివరిలో విడుదలైన ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ లాంచ్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు యాపిల్‌కు ఊపునిచ్చాయి.
సాధారణంగా ఆన్‌లైన్ పండుగ సేల్స్ కోసం సెప్టెంబర్ నెలలోనే నిల్వలు సిద్ధం చేసుకుంటారని పేర్కొంది. అయితే ఈసారి కొత్తగా ప్రత్యేక లాంచ్‌లు లేకపోవడం, బడ్జెట్ ధరలలో ఫోన్ల లభ్యత తగ్గడం వల్ల ఆన్‌లైన్ ఛానెళ్లకు లభించే సాంప్రదాయ పండుగ ప్రయోజనం దెబ్బతిందని వివరించింది. ఇది ప్రధానంగా ఆన్‌లైన్ విక్రయాలపై ఆధారపడే చైనీస్ బ్రాండ్లను దెబ్బతీసింది. ఫలితంగా వారి సంయుక్త మార్కెట్ వాటా 75 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications