Lay Off's: ఏఐ భూతం.. లక్షల్లో ఉద్యోగాలు మాయం..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచగతిని వేగంగా మారుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ విప్లవం భారీ మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్ని ఇప్పుడు ఏఐపై దృష్టి సారిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇండెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత రెండేళ్లుగా లే ఆఫ్స్ కొనసాగుతోన్నాయి. తాజాగా కూడా ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే రెండు, మూడు దఫాల్లో ఉద్యోగులను తొలగించాయి.
Layoffs.fyi ప్రకారం ప్రపంచ సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల తొలగింపు క్రమంగా పెరుగుతోంది. 2026లో సంవత్సరంలో అర్ధ భాగం మూగిసేలోగా గత సంవత్సరం కంటే ఎక్కువ ఉద్యోగాలు పోయాయి. అప్పటికే ఈ సంఖ్య 2025లో నమోదైన మొత్తం ఉద్యోగాల కోతను 6 నెలల్లోనే అధిగమించింది. 2026 జూలై 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంబంధించి సాంకేతిక ఉద్యోగాల తొలగింపు 1.28 లక్షల చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువ.

2025లో 1.25 లక్షల మంది ఉద్యోగం కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆరు నెలల్లోనే అంతకుమించి ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు వేగంగా ఏఐతో పాటు ఆటోమేషన్ ను అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత సుమారు 81,000గా ఉంది. అయితే 2021లో ఆ సంఖ్య భారీగా తగ్గింది. మళ్లీ 2022లో ఉద్యోగాల తొలగింపు 1.65 లక్షలకు పెరిగింది. ఇది 2023లో మరింత పెరిగింది. ఈ సంవత్సరంలో 2.66 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే 2024, 2025 లే ఆఫ్స్ తగ్గినప్పటికీ 2026 భారీగా పెరిగే అవకాశం ఉంది.
కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా 7.16 శాతం లే ఆఫ్స్ తో అగ్ర స్థానంలో నిలవగా.. భారత్ 2.43 శాతం లే ఆఫ్స్ తో రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే దేశాలు ఉన్నాయి. ఇండియాలో ఏఐ వల్ల విద్య రంగంలో ఎక్కువ మంది ఉద్యోగం కోల్పోయారు. 21.67 విద్యారంగం టాప్ లో ఉంది. ఆ తర్వాత ఆర్థిక రంగం, ఆహార రంగం, రవాణా రంగం ఉన్నాయి. కాగా భవిష్యత్ లో మరిన్ని లే ఆఫ్స్ ఉండే అవకాశం ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications