TOMCOM: జర్మనీలో ఉద్యోగమంటూ ప్రకటన.. ఒక్కొక్కరి నుంచి రూ. లక్షల్లో వసూల్లు..!

జర్మనీలో ఉద్యోగాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) చేపట్టిన నియామక ప్రక్రియలో మోసపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై హ్యూమన్ రైట్స్ ఫోరమ్ స్పందించింది. అక్టోబర్ 31న బాధితులతో నిర్వహించిన సమావేశంలో సేకరించిన వివరాల ఆధారంగా టామ్ కామ్ అనుసరించిన నియామక విధానంపై HRF ఆందోళన వ్యక్తం చేసింది. మొదటగా జర్మనీలో మెకాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొంటూ టామ్ కామ్ ఒక ఆకర్షణీయమైన బ్రోచర్‌ను విడుదల చేసిందని బాధితులు ఆరోపించారు. ఇదే విషయాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ప్రకటనను నమ్మి అభ్యర్థులు టామ్ కామ్ ను సంప్రదించారు. గత బ్యాచ్‌లకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే జర్మనీలో ఉద్యోగాలు పొందారని చెప్పారు. ఉద్యోగం ఖాయమని భావించిన అభ్యర్థులు ఈ కార్యక్రమంలో చేరారు. అయితే జర్మన్ భాషా శిక్షణ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫెయిర్‌స్ట్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థను ఇందులో భాగస్వామిగా చేర్చారు. శిక్షణ మొదలైన రెండు వారాల తర్వాత, అభ్యర్థుల చేత ఈ ప్రైవేట్ సంస్థతో ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు చేయించారు. ఆ ఒప్పందం ప్రకారం, అభ్యర్థులు ఫెయిర్‌స్ట్రీట్ సంస్థకు రూ. 4,10,400 ఫీజు చెల్లించాల్సి వచ్చింది.

TOMCOM

చివరకు ప్రవేశ పత్రాలను కూడా ఆ ప్రైవేట్ సంస్థే జారీ చేసింది. ఫీజు వసూలు చేసినప్పటికీ, నాణ్యమైన శిక్షణ అందించడంలో ఆ సంస్థ విఫలమైందని. దీంతో చాలామంది అభ్యర్థులు పరీక్షలో విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలకు బదులుగా జర్మనీలో చెత్త సేకరణ, పశువుల వధశాలల్లో పనిచేయడం వంటి పనులను పరిశీలించమని ఆ సంస్థ అభ్యర్థులకు సూచించిందని బాధితులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రశ్నించినప్పుడు టామ్ కామ్ అధికారులు సరైన సమాధనం ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ చేసిన ప్రకటనలను నమ్మి మోసపోయిన అభ్యర్థుల పరిస్థితిపై మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

ఒక ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ ఏజెన్సీని భాగస్వామిగా నియమించుకున్నప్పటికీ, అన్ని ఒప్పందాలు నేరుగా ప్రభుత్వ సంస్థ (TOMCOM) పేరుతోనే జరగాలని, ప్రైవేట్ సంస్థ పేరుతో కాదని స్పష్టం చేసింది. కార్మిక శాఖ మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని పేర్కొంది. ఈ మోసం కారణంగా చాలామంది యువకులు తమ జీవితంలోని విలువైన రెండేళ్లను ఇప్పటికే కోల్పోయారని ఫోరమ్ ఆవేదన వ్యక్తం చేసింది. వారికి న్యాయం చేయాలని కోరింది. దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమారు కూడా స్పందించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+